Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 413 Old No: 190

దేవా నీ దివ్య వాక్యము

Devaa Nee Divya Vakyamu

Open in Word & Worship App
తెలుగు   దేవా నీ దివ్య వాక్యము
పల్లవి
దేవా నీ దివ్య వాక్యము - ఈవిగ మాకు దొరికెను
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ
1)
పాపముతో నిండిన మమ్మున్‌ - దీపమువంటి వాక్యమే
కల్వరికి నడిపించి - కలుషమును తొలగించి
మా హృదయము వెలిగించెను
|| దేవా ||
2)
వానవంటి వాక్యము - తేనె కంటె మధురము
వెండి బంగారముల - వెల యెంతయైనను
తులతూగవు నీ వాక్యముతో
|| దేవా ||
3)
నీ వాక్యము నీరైయుండెన్‌ - మా దాహము తీర్చుచుండెన్‌
ఆ నీరే మాకు - పానము స్నానము - నీ వాక్యము మాకీయుమా
|| దేవా ||
4)
నిర్మల క్షీరమువంటిది - నిత్యాహారము వంటిది - నీ పాలతో
మము పెంచి - నీ తోటలో మము వుంచి - నీ బలమును
మాకీయుమా
|| దేవా ||
5)
సుత్తెయై మెత్తన జేయున్‌ - విత్తనమై ఫలియించును
ఖడ్గమువలె దూయుచు - కలుషమును కోయుచు
నీ మహిమను మాకీయుమా
|| దేవా ||
6)
అద్దము వలె దిద్దును మమ్మున్‌ - అగ్నియై కాల్చున్‌ చెత్తన్‌
నీ వాక్యము వివరించి - మాలోటులు సవరించి - నీ రూపము
మా కీయుమా
|| దేవా ||
7)
వాక్యముతో నింపితివి - సాక్షులుగా పంపితివి - నీ చేతిలో
మము దాచి నీ చూపుతో మము కాచి - నీ సన్నిధి మాకీయుమా
|| దేవా ||
English   Devaa Nee Divya Vakyamu
Chorus
Devaa Nee Divya Vaakyamu - Eeviga Maaku Dorikenu
Hallelooya - Hallelooya - Hallelooya - Hallelooya
1)
Paapamuto Nindina Mammun - Deepamuvanti Vaakyame
Kalvariki Nadipinchi - Kalushamunu Tolaginchi
Maa Hrudayamu Veliginchenu
|| Devaa ||
2)
Vaanavanti Vaakyamu - Tene Kante Madhuramu
Vendi Bangaaramula - Vela Yentayainanu
Tulatoogavu Nee Vaakyamuto
|| Devaa ||
3)
Nee Vaakyamu Neeraiyunden - Maa Daahamu Teerchuchunden
Aa Neere Maaku - Paanamu Snaanamu - Nee Vaakyamu Maakeeyumaa
|| Devaa ||
4)
Nirmala Ksheeramuvantidi - Nityaahaaramu Vantidi - Nee Paalato
Mamu Penchi - Nee Totalo Mamu Vunchi - Nee Balamunu
Maakeeyumaa
|| Devaa ||
5)
Sutteyai Mettana Jeyun - Vittanamai Phaliyinchunu
Khadgamuvale Dooyuchu - Kalushamunu Koyuchu
Nee Mahimanu Maakeeyumaa
|| Devaa ||
6)
Addamu Vale Diddunu Mammun - Agniyai Kaalchun Chettan
Nee Vaakyamu Vivarinchi - Maalotulu Savarinchi - Nee Roopamu
Maa Keeyumaa
|| Devaa ||
7)
Vaakyamuto Ninpitivi - Saakshulugaa Panpitivi - Nee Chetilo
Mamu Daachi Nee Chooputo Mamu Kaachi - Nee Sannidhi Maakeeyumaa
|| Devaa ||
Present