Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 410 Old No: 187

నీ స్వరము వినిపించు

Nee Svaramu Vinipinchu

Open in Word & Worship App
తెలుగు   నీ స్వరము వినిపించు
పల్లవి
నీ స్వరము వినిపించు ప్రభువా - నీ దాసుడాలకించున్‌
నీ వాక్యము నేర్పించు - దానియందు నడచునట్లు నీతో
1)
ఉదయమునేలేచి నీ స్వరము వినుట - నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు నను సిద్ధపరచు - రక్షించు ఆపదలనుండి
|| నీ ||
2)
నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు - నేను సరిజేసుకొందు
నీ మార్గములో నడచునట్లుగా - నేర్పించుము ఎల్లప్పుడు
|| నీ ||
3)
భయభీతులలో, తుఫానులలో - నీ స్వరము వినిపించుము
అభయమునిమ్ము ఓ గొప్పదేవా - ధైర్యపరచుము నన్ను
|| నీ ||
4)
నాతో మాట్లాడు, స్పష్టముగా ప్రభువా - నీ వాక్యము నా కొరకే
నీతో మనుష్యులతో సరిజేసికొందు - నీ దివ్య వాక్యముద్వారా
|| నీ ||
5)
నీ వాక్యము అగ్ని సుత్తెవంటిది - అది రెండంచులుగల ఖడ్గము
నీ వాక్యమేగా అద్భుత అద్దం - నిజస్వరూపము చూపించున్‌
|| నీ ||
6)
నేర్చుకొన్నాను నా శ్రమలద్వారా - నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా నీవిశ్వాస్యతతో - నీయందు నిలుచునట్లుగా
|| నీ ||
English   Nee Svaramu Vinipinchu
Chorus
Nee Svaramu Vinipinchu Prabhuvaa - Nee Daasudaalakinchun
Nee Vaakyamu Nerpinchu - Daaniyandu Nadachunatlu Neeto
1)
Udayamunelechi Nee Svaramu Vinuta - Naaku Ento Madhuramu
Dinamantati Koraku Nanu Sidhaparachu - Rakshinchu Aapadalanundi
|| Nee ||
2)
Nee Vaakyamu Chadivi Nee Svaramu Vinuchu - Nenu Sarijesukondu
Nee Maargamulo Nadachunatlugaa - Nerpinchumu Ellappudu
|| Nee ||
3)
Bhayabheetulalo, Tuphaanulalo - Nee Svaramu Vinipinchumu
Abhayamunimmu O Goppadevaa - Dhairyaparachumu Nannu
|| Nee ||
4)
Naato Maatlaadu, Spashtamugaa Prabhuvaa - Nee Vaakyamu Naa Korake
Neeto Manushyulato Sarijesikondu - Nee Divya Vaakyamudvaaraa
|| Nee ||
5)
Nee Vaakyamu Agni Suttevantidi - Adi Rendanchulugala Khadgamu
Nee Vaakyamegaa Adbhuta Addan - Nijasvaroopamu Choopinchun
|| Nee ||
6)
Nerchukonnaanu Naa Sramaladvaaraa - Nee Vaakyamunu Ento
Nannunchumu Prabhuvaa Neevisvaasyatato - Neeyandu Niluchunatlugaa
|| Nee ||
Present