తెలుగు అందుకొనుము నాదు వందనము
పల్లవిఅందుకొనుము నాదు వందనము - నా యేసు ప్రభువా!
స్వీకరించుము నాదు స్తోత్రములు - స్వీకరించుము నాదు
స్తోత్రము - నీదు ప్రేమను మరువజాల మహిమ వీడి
మానవుడవై మరణ మొంది తిరిగి లేచితి
1)పాపమునన్ పుట్టినవాడ - నా బ్రతుకనందు పాపమునన్ పెరిగి యున్నాడ
పాప జీతము మరణమొంగా వేరే మార్గంలేని నాకు
మరణమున్ జయించలేచి జీవమిచ్చితి యేసునాధ
|| అందు ||
2)నీకు దూరముగాను నేనుంటి - పాపాత్ముడనై నీకు విరోధిగను నేనుంటిన్
నీదు ప్రేమచే యేసునాథ! పరమున్ విడిచి దాసుడైతివి
మనుజరూపముదాల్చి నీవు రిక్తుడైతివి యెట్లు మరతును
|| అందు ||
3)కన్య గర్భములోనే బుట్టితివి - పాపంబులేక పవిత్రుడవై జీవించితివి
పాపినైన నాదు శిక్షను - సిలువపైన ననుభవించి
నీదు రక్తము నెల్ల కార్చితివయ్య నే నీకేమి యిత్తును
|| అందు ||
4)తలను గొట్టిరి ముండ్లకిరీటం - తుడమట్లు కొర్చితి గట్టి దెబ్బల
నిన్ను గొట్టంగ - తిట్టు బూతులు తిట్టుచుండగ నెట్టి మాటను
పలుకవైతివి సిలువ మరణము పొంది నీవు తిరిగిలేచితి యేసునాధ
|| అందు ||
English Andukonumu Naadu Vandanamu
ChorusAndukonumu Naadu Vandanamu - Naa Yesu Prabhuvaa!
Sveekarinchumu Naadu Stotramulu - Sveekarinchumu Naadu
Stotramu - Needu Premanu Maruvajaala Mahima Veedi
Maanavudavai Marana Mondi Tirigi Lechiti
1)Paapamunane Puttinavaada - Naa Bratukunandu Paapamunane Perigi Yunnaada
Paapa Jeetamu Maranamaugaa Vere Maarganleni Naaku
Maranamun Jayinchilechi Jeevamichchiti Yesunaatha
|| Andu ||
2)Neeku Dooramugaanu Nenunti - Paapaatmudanai Neeku Virodhiganu Nenuntin
Needu Premache Yesunaatha! Paramun Vidichi Daasudaitivi
Manujaroopamudaalchi Neevu Riktudaitivi Yetlu Maratunu
|| Andu ||
3)Kanya Garbhamulone Buttitivi - Paapanbuleka Pavitrudavai Jeevinchitivi
Paapinaina Naadu Sikshanu - Siluvapaina Nanubhavinchi
Needu Raktamu Nella Kaarchitivayya Ne Neekemi Yittunu
|| Andu ||
4)Talanu Gottiri Mundlakireetan - Tudamattu Korchiti Gatti Debbala
Ninnu Gottanga - Tittu Botulu Tittuchundaga Netti Maatanu Palukavaitivi
Siluva Maranamu Pondi Neevu Tirigilechiti Yesunaatha
|| Andu ||