తెలుగు నా ప్రాణమా నాలో నీవు
పల్లవినా ప్రాణమా నాలో నీవు - ఎందుకు కృంగియున్నావు
యెహోవా యందే నమ్మిక - నిరీక్షణ యుంచుము నీవు
1)ఈతిబాధల్ కఠినశ్రమలే - అవమానములే కల్గిన వేళన్
నీ కొరకై బలియైన యేసు - సిలువను గూర్చి తలపోయుమా
అల్పకాల శ్రమల పిదప - మహిమతోనిన్ నింపు ప్రభు
నా ప్రాణమా
|| నా ||
2)ఆప్తులంతా నిను వీడినను - శత్రువులే చెలరేగి లేచిన వేళ
తల్లియైన మరచిన మరచున్ - నేను నిన్ను మరువననిన
యేసుని ప్రేమన్ తలపోయుమా - ఆశ్రయించు ప్రభుని
నా ప్రాణమా
|| నా ||
3)ఐశ్వర్యమే లేకున్నను - సౌఖ్య జీవితమే కరువైనను
ప్రభుసేవలో ప్రాణంబులన్ - అర్పింప వలసి వచ్చినను
క్రీస్తునకే అంకితమై ఆనందించు - ప్రభురాకకై కనిపెట్టుమా
నా ప్రాణమా
|| నా ||
English Naa Praanamaa Naalo Neevu
ChorusNaa Praanamaa Naalo Neevu - Enduku Krngiyunnaavu
Yehovaa Yande Nammika - Nireekshana Yunchumu Neevu
1)Eetibaadhal Kathinasramale - Avamaanamule Kalgina Velan
Nee Korakai Baliyaina Yesu - Siluvanu Goorchi Talapoyumaa
Alpakaala Sramala Pidapa - Mahimatonin Ninpu Prabhu
Naa Praanamaa
|| Naa ||
2)Aaptulantaa Ninu Veedinanu - Satruvule Chelaregi Lechina Vela
Talliyaina Marachina Marachun - Nenu Ninnu Maruvananina
Yesuni Preman Talapoyumaa - Aasrayinchu Prabhuni
Naa Praanamaa
|| Naa ||
3)Aisvaryame Lekunnanu - Saukhya Jeevitame Karuvainanu
Prabhusevalo Praananbulan - Arpinpa Valasi Vachchinanu
Kreestunake Ankitamai Aanandinchu - Prabhuraakakai Kanipettumaa
Naa Praanamaa
|| Naa ||