Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 397 Old No: 437

అభయమొసంగిన యేసు

Abhayamosangina Yesu

Open in Word & Worship App
తెలుగు   అభయమొసంగిన యేసు
పల్లవి
అభయ మొసగిన యేసు డుండగా చింతలేల సోదరా?
ఆదరించు నాధుడుండగా - శోకమేల సోదరి?
చింతలెల్ల తీర్చుప్రభువు - నీదుచెంతనే యుండగా
భయపడకుమా బాధలందు - ఆదరించు ఆప్తుడేసు
1)
కారు చీకటి క్రమ్మిన - ఘోరతుఫాను చెలరేగిన
విడువడు నీ నాథుడు - కడవరకు నిను కాయును
|| అ ||
2)
క్రుంగిన సమయంబులో - భంగపడిన వేళలో
భారభరితమైన బ్రతుకుల - బాధ నుండి విడిపించుయేసు
|| అ ||
3)
మరణకరమగు లోయను - దాటవలసిన వేళలో
చేయిపట్టి వడిగనడిపి - త్వరగ చేర్చును దరికినిన్ను
|| అ ||
4)
అలలవలె శ్రమలు లేచిన - కెరటములవలె దుఃఖములు కల్గిన
నీదుచెంత నిలిచి యేసు - తుడుచు నీ కన్నీటిధారల్‌
|| అ ||
5)
క్షణికమే శ్రమలిపుడు మనకు - శాశ్వతమే బహుమహిమ మనకు
క్షణిక శ్రమలు దాటి మనము - ప్రభుతో ఆనందింతుము నిరతం
|| అ ||
English   Abhayamosangina Yesu
Chorus
Abhaya Mosagina Yesu Dundagaa Chintalela Sodaraa?
Aadarinchu Naadhudundagaa - Sokamela Sodari?
Chintalella Teerchuprabhuvu - Needuchentane Yundagaa
Bhayapadakumaa Baadhalandu - Aadarinchu Aaptudesu
1)
Kaaru Cheekati Krammina - Ghoratuphaanu Chelaregina
Viduvadu Nee Naathudu - Kadavaraku Ninu Kaayunu
|| A ||
2)
Krungina Samayanbulo - Bhangapadina Velalo
Bhaarabharitamaina Bratukula - Baadha Nundi Vidipinchuyesu
|| A ||
3)
Maranakaramagu Loyanu - Daatavalasina Velalo
Cheyipatti Vadiganadipi - Tvaraga Cherchunu Darikininnu
|| A ||
4)
Alalavale Sramalu Lechina - Keratamulavale DuHkhamulu Kalgina
Needuchenta Nilichi Yesu - Tuduchu Nee Kanneetidhaaral
|| A ||
5)
Kshanikame Sramalipudu Manaku - Saasvatame Bahumahima Manaku
Kshanika Sramalu Daati Manamu - Prabhuto Aanandintumu Niratan
|| A ||
Present