తెలుగు నా కొరకై అన్నియు
పల్లవినా కొరకై అన్నియు చేసెను యేసు
నాకింక భయము లేదు లోకములో
నాకొరకై అన్నియు చేసినందులకు
నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్
1)క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామంతీర్చి ఏలీయాను ఆశీర్వదించెన్
క్షామం తీరేవరకు ఆ విధవరాలి
ఇంట నూనెకైనా పిండికైనా కొరతలేదు
|| నా కొరకై ||
2)ఆకాశ పక్షులను గమనించుడి
విత్తవు అవి పంటను కోయవు
వాటిని పోషించునట్టి పరమపిత - మమ్ము
అనుదిన - మద్భుతముగా నడుపున్
|| నా కొరకై ||
3)ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పుష్పములను తేరిచూడుము
అడవి పువ్వుల ప్రభు అలంకరింప - తానే
నిశ్చయంబుగా మమ్ము అలంకరించును
|| నా కొరకై ||
4)రేపటి దినము గూర్చి చింతపడకు
ఆప్తుడేసు నాకుండ భయమెందుకు
రేపుదాని సంగతులనదే చింతించున్
ఏ నాటి కీడు ఆనాటికే ఇలచాలును
|| నా కొరకై ||
5)ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదువేలమందిని కూడ
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ - యేసు
తన్ను తానే అర్పించెను నా కొరకై
|| నా కొరకై ||
English Naa Korakai Anniyu
ChorusNaa Korakai Anniyu Chesenu Yesu
Naakinka Bhayamu Ledu Lokamulo
A.Pa: Naakorakai Anniyu Chesinandulaku
Nenu Rakshana Paatranu Yetti Aaraadhinchedan
1)Kshaamamandu eleeyaaku Appamichchenu
Kshaamanteerchi eleeyaanu Aaseervadinchen
Kshaaman Teerevaraku Aa Vidhavaraali
Inta Noonekainaa Pindikainaa Korataledu
|| Naa Korakai ||
2)Aakaasa Pakshulanu Gamaninchudi
Vittavu Avi Pantanu Koyavu
Vaatini Poshinchunatti Paramapita - Mammu
Anudina - Madbhutamugaa Nadupun
|| Naa Korakai ||
3)emi Dharintumani Chintapadaku
Adavi Pushpamulanu Terichoodumu
Adavi Puvvula Prabhu Alankarinpa - Taane
Nischayanbugaa Mammu Alankarinchunu
|| Naa Korakai ||
4)Repati Dinamu Goorchi Chintapadaku
Aaptudesu Naakunda Bhayamenduku
Repudaani Sangatulanade Chintinchun
e Naati Keedu Aanaatike Ilachaalunu
|| Naa Korakai ||
5)Aaseervadinchedi Yesu Aranyamulo
Poshinchenu Aiduvelamandini Kooda
Teerchunu Prabhuve Prati Avasaratan - Yesu
Tannu Taane Arpinchenu Naa Korakai
|| Naa Korakai ||