Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 392 Old No: 838

నీవు ఎంతైన నమ్మదగిన

Neevu Entaina Nammadagina

Open in Word & Worship App
తెలుగు   నీవు ఎంతైన నమ్మదగిన
పల్లవి
నీవు ఎంతైన నమ్మదగిన దేవుడవు యేసయ్యా
యేసయ్యా నమ్మదగిన యేసయ్యా
1)
అబ్రాహాము ఇస్సాకు యాకోబుకు - ఒకటే వాగ్ధానం చేశావు ప్రభువా
నీ సంతతిని విస్తరింపజేసి - వాగ్ధాన భూమిలో చేర్చెదనన్నావు
|| నీవు ||
2)
వాగ్ధానము చేసి మాట తప్పవు - నష్టము కలిగినను వెనుకాడవు
వాగ్దానములన్ని యేసుక్రీస్తులో - విమోచించి యిచ్చావు ప్రభువా
|| నీవు ||
3)
ముప్పై వేల వాగ్ధానము లిచ్చి - ఈనాటి వరకు నెరవేర్చుచుంటివి
రాబోవు తరములో నెరవేర్చువాడా - నిన్న నేడు ఒకటే నీ మాట
|| నీవు ||
4)
నేనుండు స్థలములో మీరుండునట్లు - స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నానని
వాగ్ధానము చేసి వెళ్ళావు ప్రభువా - నీ రాకడకై ఎదురు చూస్తున్నాము
|| నీవు ||
English   Neevu Entaina Nammadagina
Chorus
Neevu Entaina Nammadagina Devudavu Yesayyaa
Yesayyaa Nammadagina Yesayyaa
1)
Abraahaamu Issaaku Yaakobuku - Okate Vaagdhaanan Chesaavu Prabhuvaa
Nee Santatini Vistarinpajesi - Vaagdhaana Bhoomilo Cherchedanannaavu
|| Neevu ||
2)
Vaagdhaanamu Chesi Maata Tappavu - Nashtamu Kaliginanu Venukaadavu
Vaagdaanamulanni Yesukreestulo - Vimochinchi Yichchaavu Prabhuvaa
|| Neevu ||
3)
Muppai Vela Vaagdhaanamu Lichchi - Eenaati Varaku Neraverchuchuntivi
Raabovu Taramulo Neraverchuvaadaa - Ninna Nedu Okate Nee Maata
|| Neevu ||
4)
Nenundu Sthalamulo Meerundunatlu - Sthalamu Siddaparacha
Velluchunnaanani
Vaagdhaanamu Chesi Vellaavu Prabhuvaa - Nee Raakadakai Eduru
Choostunnaamu
|| Neevu ||
Present