Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 391

మా దేవా మా దేవా

Maa Devaa Maa Devaa

Open in Word & Worship App
తెలుగు   మా దేవా మా దేవా
పల్లవి
మా దేవా - మా దేవా నీదు - విశ్వాస్యత చాల గొప్పది
1)
దయామయుండగు తండ్రివి నీవే - తల్లిని మించిన దాతవు నీనే
మాయా మమతల గాధలనుండి - మమ్ములను రక్షించితివి
|| మా దేవా ||
2)
కోడిపిల్లలను గాచెడు 1పగిది - ఆపదలన్నిటి బాసితివయ్యా
సర్వకాలములయందున నీకె - చక్కగ సంస్తుతులగు నీకే
|| మా దేవా ||
3)
సింహపు పిల్లలు ఆకలిగొనిన - సింహపు బోనులో నను వేసినను
సిగ్గు కలుగకుండగ నను నీవు - కాపాడుచున్న వీలలో
|| మా దేవా ||
4)
మరణ లోయలందున నే నున్న - తరుణములు నాకు విరోధమైన
చరణముల్‌ పాడెడు విధమున నీవు - నన్నొనర్చుచున్నావుగా
|| మా దేవా ||
5)
వ్యాధులు నన్ను బాధించినను-వ్యాకులములు హృదయములో నున్న
వదలవు నన్నిల అనాథునిగ నె - ప్పుడు నను బ్రోచుచు నుందువుగా
|| మా దేవా ||
6)
నీదు సత్య మకాశము కంటె - అత్యున్నతముగ స్థాపించబడె
నీదు సత్యమును నీచుడనగు నా - కనులకు ప్రత్యక్షపరచితివి
|| మా దేవా ||
7)
పర్వతంబులు తొలగిన గాని - పలువిధ కొండలు తత్తరిల్లినను
ప్రోవనుఊ నీదు వెలలేని యట్టి - కృప నను విడువడు హల్లెలూయా
1రీతి
|| మా దేవా ||
English   Maa Devaa Maa Devaa
Chorus
Maa Devaa - Maa Devaa Needu - Visvaasyata Chaala Goppadi
1)
Dayaamayundagu Tandrivi Neeve - Tallini Minchina Daatavu Neene
Maayaa Mamatala Gaadhalanundi - Mammulanu Rakshinchitivi
|| Maa Devaa ||
2)
Kodipillalanu Gaachedu 1pagidi - Aapadalanniti Baasitivayyaa
Sarvakaalamulayanduna Neeke - Chakkaga Sanstutulagu Neeke
|| Maa Devaa ||
3)
Sinhapu Pillalu Aakaligonina - Sinhapu Bonulo Nanu Vesinanu
Siggu Kalugakundaga Nanu Neevu - Kaapaaduchunna Veelalo
|| Maa Devaa ||
4)
Marana Loyalanduna Ne Nunna - Tarunamulu Naaku Virodhamaina
Charanamul Paadedu Vidhamuna Neevu - Nannepudu Viduvave
|| Maa Devaa ||
5)
Vyaadhulu Nannu Baadhinchinanu - Vyaakulamulu Hrudayamulo Nunna
Vadalavu Nannila Anaathuniga Ne - Visvasinche Velalo
|| Maa Devaa ||
6)
Needu Satya Maakasamu Kante - Atyunnatamuga Sthaaapinchade
Needu Satyamunu Neechudanagu Naa - Kanulaku Veluguide
|| Maa Devaa ||
7)
Parvatambulu Tolagina Gaani - Paluvidhha Kondalu Tattarillinanu
Provanoo Needu Velaeleni Yatti - Prema Tagilipovadu
|| Maa Devaa ||
Present