Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 379 Old No: 164

నీవు తోడైయున్న జాలు

Neevu Todaiyunna Jaalu

Open in Word & Worship App
తెలుగు   నీవు తోడైయున్న జాలు
పల్లవి
నీవు తోడై యున్న జాలు - యేసు - నిత్యము నాకదిమేలు
నీవు ధరణీనుండు - నీచపాపుల నెల్ల గావ బ్రేమ వచ్చి
ఘన ప్రాణ మిడినట్టి
1)
నిను బోలు రక్షకుండేడి - క్రీస్తు - ననుబోలు పాతకుం డేడి
నిన్ను నమ్ము వారలకు - నీవొసగుచుందువు - తనర పాపక్షమ
దయచేత నిలలోన
|| నీవు ||
2)
నీ పాటి బలవంతుండేడి - ప్రభు - నాపాటి దుర్భలుండేడి
కాపాడుచుందువు - కలకాలమును నీవు - నీ పాద సేవకుల
నీ నేర్పు రంజిల్ల
|| నీవు ||
3)
నీవంటి యుపకారి యేడి - కర్త - నావంటి కడు దీనుండేడి
జీవులకును గలుగ - జీవంబు లిచ్చును - జీవాధారము లొసగి
జీవులంబ్రోచెడి
|| నీవు ||
4)
నీవంటి ధనవంతుండేడి - యేసు - నావంటి ధనహీనుండేడి
ప్రోవులై యున్నవి - యీవులు నీయందు - నీవు వాని నొసంగి
నిరతంబు ననుంగావు
|| నీవు ||
English   Neevu Todaiyunna Jaalu
Chorus
Neevu Todai Yunna Jaalu - Yesu - Nityamu Naakadimelu
Neevu Dharaneenundu - Neechapaapula Nella Gaava Brema Vachchi
Ghana Praana Midinatti
1)
Ninu Bolu Rakshakundedi - Kreestu - Nanubolu Paatakun Dedi
Ninnu Nammu Vaaralaku - Neevosaguchunduvu - Tanara Paapakshama
Dayacheta Nilalona
|| Neevu ||
2)
Nee Paati Balavantundedi - Prabhu - Naapaati Durbhalundedi
Kaapaaduchunduvu - Kalakaalamunu Neevu - Nee Paada Sevakula
Nee Nerpu Ranjilla
|| Neevu ||
3)
Neevanti Yupakaari Yedi - Karta - Naavanti Kadu Deenundedi
Jeevulakunu Galuga - Jeevanbu Lichchunu - Jeevaadhaaramu Losagi
Jeevulanbrochedi
|| Neevu ||
4)
Neevanti Dhanavantundedi - Yesu - Naavanti Dhanaheenundedi
Provulai Yunnavi - Yeevulu Neeyandu - Neevu Vaani Nosangi
Niratanbu Nanungaavu
|| Neevu ||
Present