Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 377

నా తల్లి నను మరచినా

Naa Talli Nanu Marachinaa

Open in Word & Worship App
తెలుగు   నా తల్లి నను మరచినా
పల్లవి
నా తల్లి నను మరచినా నరులెల్ల నను విడచినా
నను మరువని దైవమా ఎడబాయని జీవమా
పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా
మనసార కీర్తింతు ముదమార సేవింతు
1)
తన పిల్లలను కోడి దాచిన రీతిగ - దాచావు నను నీ రెక్కల క్రింద
గాడాంధకారపు లోయల లోన - జిగటైన ఆ దొంగ ఊబి లోన
|| నా తల్లి ||
2)
ఉప్పొంగు అగాధ జలముల లోన - చెలరేగు ప్రళయాగ్ని జ్వాల లోన
భయమేల దేవా నీవుండగా - జయమే సదా నీ తోడుండగా
|| నా తల్లి ||
3)
కరువైన చెరయైన వెనుదీయనూ - ఆ మృత్యు వెదురైన నే వెరువనూ
ఈ భూదిగంతముల నిను చాటెదన్‌ - నీ సాక్షిగా నే జీవించెదన్‌
|| నా తల్లి ||
English   Naa Talli Nanu Marachinaa
Chorus
Naa Talli Nanu Marachinaa Narulella Nanu Vidachinaa
Nanu Maruvani Daivamaa Edabaayani Jeevamaa
Parisuddhudaa Prabhu Yesayyaa
Manasaara Keertintu Mudamaara Sevintu
1)
Tana Pillalanu Kodi Daachina Reetiga - Daachaavu Nanu Nee Rekkala Krinda
Gaadaandhakaarapu Loyala Lona - Jigataina Aa Donga Oobi Lona
|| Naa Talli ||
2)
Uppongu Agaadha Jalamula Lona - Chelaregu Pralayaagni Jvaala Lona
Bhayamela Devaa Neevundagaa - Jayame Sadaa Nee Todundagaa
|| Naa Talli ||
3)
Karuvaina Cherayaina Venudeeyanoo - Aa Mrtyu Veduraina Ne Veruvanoo
Ee Bhoodigantamula Ninu Chaatedan - Nee Saakshigaa Ne Jeevinchedan
|| Naa Talli ||
Present