తెలుగు సర్వేస్తుతుని చాటున
పల్లవిసర్వోన్నతుని చాటున - నివసించెడి వాడె
సర్వశక్తుని నీడను విశ్రమించును - పరమ ధన్యత యిదియే
తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును
1)ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమును
ఆయనే సత్యము నా కేడెమును - నేనమ్ముకొను దేవుడు
|| త ||
2)పగటి బాణముకైన - రాత్రి భయమునకైన
చీకటిలో తిరుగు తెగులుకైన - నేనేమి భయపడను
|| త ||
3)వేయి పదివేలు - కుడి ప్రక్కను కూలినను
దయచూపు దేవుడు నీకుండ - అపాయము రాదు
|| త ||
4)నీ ప్రభువాశ్రయమే - యెహోవా నివాసం
అపాయము తెగులు - నీ గుడారము సమీపించవు
|| త ||
5)నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్
పాదములకు - రాయి తగులకుండ నిన్నెత్తుకొందురు
|| త ||
6)కొదమ సింహముల - నాగుపాముల నణచెదవు
అతడు నా నామము నెరిగెను - అతని తప్పించెదను
|| త ||
7)అతడు నను ప్రేమించెన్ - నామమున మొరపెట్టెన్
అతని విడిపించి ఘనపరతున్ - అతని కుత్తరమిత్తున్
|| త ||
English Sarvesnutuni Chaatuna
ChorusSarvonnatuni Chaatuna - Nivasinchedi Vaade
Sarvasaktuni Needanu Visraminchunu - Parama Dhanyata Yidiye
Tana Rekkala Krinda Aasrayamu Tana Rekkalato Kappunu
1)Aayane Naa Aasrayamu - Naa Kotayu Durgamunu
Aayane Satyamu Naa Kedemunu - Nenammukonu Devudu
|| Ta ||
2)Pagati Baanamukaina - Raatri Bhayamunakaina
Cheekatilo Tirugu Tegulukaina - Nenemi Bhayapadanu
|| Ta ||
3)Veyi Padivelu - Kudi Prakkanu Koolinanu
Dayachoopu Devudu Neekunda - Apaayamu Raadu
|| Ta ||
4)Nee Prabhuvaasrayame - Yehovaa Nivaasam
Apaayamu Tegulu - Nee Gudaaramu Sameepinchavu
|| Ta ||
5)Needu Maarganbulalo - Ninnu Dootalu Kaayun
Paadamulaku - Raayi Tagulakunda Ninnettukonduru
|| Ta ||
6)Kodama Sinhamula - Naagupaamula Nanachedavu
Atadu Naa Naamamu Nerigenu - Atani Tappinchedanu
|| Ta ||
7)Atadu Nanu Preminchen - Naamamuna Morapetten
Atani Vidipinchi Ghanaparatun - Atani Kuttaramittun
|| Ta ||