Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 363 Old No: 523

సన్నుతింతు దేవా

Sannutinthu Devaa

Open in Word & Worship App
తెలుగు   సన్నుతింతు దేవా
పల్లవి
సన్నుతింతు దేవా - కృపా సత్య సంపూర్ణా
నాదు రక్షణ కర్తా - నాదు ప్రభువా సర్వేశ్వరా
1)
మంచి కాపరివైతివి - మందలో నన్ను చేర్చితివి
పరుండ జేయుచున్నాడు - పచ్చిక బయళ్లలో సమృద్ధితో
|| సన్నతిం ||
2)
శాంతి జలముల చెంత - సేద దీర్చుచున్నావు
నీతిగా నన్ను చేసినావు - నీదు రక్తముతో పరిశుద్ధునిగా
|| సన్నతిం ||
3)
గాడాంధకారపు లోయ - లందు నేను నడచినాను
నిర్భీతుని చేయుచున్నావు - నిజమైన ప్రేమతో నిరపాయముగా
|| సన్నతిం ||
4)
భోజనము సిద్ధపరచితివి - నాదు శత్రువుల ఎదుట
నా తలను అభిషేకించితివి - నీదు తైలముతో సంపూర్ణునిగా
|| సన్నతిం ||
5)
నా బ్రతుకు దినములన్నియు - కృపా క్షేమములిచ్చు చున్నావు
నివసింతు నీదు సన్నిధిని - నీదు సహవాసములో సదాకాలం
|| సన్నతిం ||
English   Sannutinthu Devaa
Chorus
Sannutintu Devaa - Krupaa Satya Sanpoornaa
Naadu Rakshana Kartaa - Naadu Prabhuvaa Sarvesvaraa
1)
Manchi Kaaparivaitivi - Mandalo Nannu Cherchitivi
Parunda Jeyuchunnaadu - Pachchika Bayallalo Samrddhito
|| Sannatin ||
2)
Saanti Jalamula Chenta - Seda Deerchuchunnaavu
Neetigaa Nannu Chesinaavu - Needu Raktamuto Parisuddhunigaa
|| Sannatin ||
3)
Gaadaandhakaarapu Loya - Landu Nenu Nadachinaanu
Nirbheetuni Cheyuchunnaavu - Nijamaina Premato Nirapaayamugaa
|| Sannatin ||
4)
Bhojanamu Sidhaparachitivi - Naadu Satruvula Eduta
Naa Talanu Abhishekinchitivi - Needu Tailamuto Sanpoornunigaa
|| Sannatin ||
5)
Naa Bratuku Dinamulanniyu - Krupaa Kshemamulichchu Chunnaavu
Nivasintu Needu Sannidhini - Needu Sahavaasamulo Sadaakaalan
|| Sannatin ||
Present