Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 361 Old No: 119

యేసు ప్రభు కాపరి

Yesu Prabhu Kaapari

Open in Word & Worship App
తెలుగు   యేసు ప్రభు కాపరి
పల్లవి
యేసు ప్రభు కాపరినాకు - వాసిగా స్తుతించెదన్‌
యేసు గొఱ్ఱెపిల్లను - పోయెదను తన వెంట
1)
పచ్చిక గల చోట్లకు - మచ్చికతో నడుపున్‌
స్వచ్చ జలము చెంత - నిచ్చును విశ్రాంతి
ముందు ముందు వెళ్ళుచు - పొందుగ రక్షించు నన్ను
తన మాధుర్య స్వరంబున - తనివి దీర్చును
|| యేసు ||
2)
మరణలోయ ద్వారా - సరిగా నడిపించును
అడవి భయమలులెల్ల - ఎడబాపి రక్షించున్‌
హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించును
వింతగు ఆయన ప్రేమ సేవలో - సంతోషింతును
|| యేసు ||
3)
శత్రుల ముందాహారం - సంసిద్ధము జేయును
నా గిన్నె నిండించి - పొర్లి పారజేసి
కడిగి కడిగి శుద్ధిచేసి - ఆత్మ దానమిచ్చెను
వడిగ ఆయన సాయమున - జయమున వెళ్ళెదను
|| యేసు ||
English   Yesu Prabhu Kaapari
Chorus
Yesu Prabhu Kaaparinaaku - Vaasigaa Sthuthinchedan
Yesu Gorrepillanu - Poyedanu Tana Venta
1)
Pachchika Gala Chotlaku - Machchikato Nadupun
Svachcha Jalamu Chenta - Nichchunu Visraanti
Mundu Mundu Velluchu - Ponduga Rakshinchu Nannu
Tana Maadhurya Svaranbuna - Tanivi Deerchunu
|| Yesu ||
2)
Maranaloya Dvaaraa - Sarigaa Nadipinchunu
Adavi Bhayamalulella - Edabaapi Rakshinchun
Hatti Otti Katti Gaayaa - Lento Aadarinchunu
Vintagu Aayana Prema Sevalo - Santoshintunu
|| Yesu ||
3)
Satrula Mundaahaaran - Sansidhamu Jeyunu
Naa Ginne Nindinchi - Porli Paarajesi
Kadigi Kadigi Suddhichesi - Aatma Daanamichchenu
Vadiga Aayana Saayamuna - Jayamuna Velledanu
|| Yesu ||
Present