Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 36 Old No: 51

జై ప్రభుయేసు జై ఘనదేవ

Jai Prabhuyesu Jai Ghanadeva

♪ సీయోను గీతములు♪ Songs of Zion
Open in Word & Worship App
తెలుగు   జై ప్రభుయేసు జై ఘనదేవ
పల్లవి
జై ప్రభుయేసు జై ఘనదేవా - జై ప్రభు జైజై రా... జా...
1)
పాప కూపములో - పడిచెడి యుండగా
గొప్ప రక్షణనిచ్చి - దరిచేర్చిన
|| జై ||
2)
విలువైన రక్తము - సిలువలో కార్చి
కలుషాత్ముని నీవు కడిగితివే
|| జై ||
3)
నా శైలమై యేసు - నన్నావరించగా -
యే శోధనైన నన్ను గెల్చునా ?
|| జై ||
4)
కడు భీకరమగు - తుఫానులలో విడువక
జయముగా - నడుపుచున్న
|| జై ||
5)
పసితనము నుండి - ముదిమి వరకు -
విసుకక ఎత్తు - కొను రక్షకా
|| జై ||
6)
సమృద్ధుడు యేసు - సహాయుడాయే
ఓ మృత్యువా! నీ - ముల్లెక్కడ ?
|| జై ||
7)
సమాధి గెలిచిన - విజయుడుండగ
సమాధి ! నీకు జయమగునా?
|| జై ||
8)
నీకంటె నాకిక - దిక్కెవ్వరును -
లోక ప్రకాశక - వేరు లేరుగా
|| జై ||
English   Jai Prabhuyesu Jai Ghanadeva
Chorus
Jai Prabhuyesu Jai Ghanadevaa - Jai Prabhu Jaijai Raa... Jaa...
1)
Paapa Koopamulo - Padichedi Yundagaa
Goppa Rakshananichchi - Daricherchina
|| Jai ||
2)
Viluvaina Raktamu - Siluvalo Kaarchi
Kalushaatmuni Neevu Kadigitive
|| Jai ||
3)
Naa Sailamai Yesu - Nannaavarinchagaa -
Ye Sodhanaina Nannu Gelchunaa ?
|| Jai ||
4)
Kadu Bheekaramagu - Tuphaanulalo Viduvaka
Jayamugaa - Nadupuchunna
|| Jai ||
5)
Pasitanamu Nundi - Mudimi Varaku -
Visukaka Ettu - Konu Rakshakaa
|| Jai ||
6)
Samrddhudu Yesu - Sahaayudaaye
O Mrtyuvaa! Nee - Mullekkada ?
|| Jai ||
7)
Samaadhi Gelichina - Vijayudundaga
Samaadhi ! Neeku Jayamagunaa?
|| Jai ||
8)
Neekante Naakika - Dikkevvarunu -
Loka Prakaasaka - Veru Lerugaa
|| Jai ||
Present