తెలుగు స్వచ్ఛంద సీయోనువాసి
పల్లవిస్వచ్చంద సీయోనువాసి - సర్వాధికారి కస్తూరి పూరాసి
వర్తమాన భూత భవిషత్కాలవాసీ - అల్ఫ ఓమేగ -
తానే - ఆద్యంతము మన యేసే
1)ఇదిగో నేనొక నిబంధనను-అద్భుతముగ జేతున్
నీ ప్రజలందరియెదుట-పరిశోధింపజాలని మహా-పనులెల్ల
ప్రభు నే-లెక్క లేని అద్భుతముల్ - మక్కువతో చేయువాడు
|| స్వ ||
2)సంగీతనాదములతోడ-సీయోనుపురము-సొంపుగను చేరితిమి
శాశ్వత సంతోషము - మా శిరములపై వెలసెన్ - దుఃఖము
నిట్టూర్పును పోయన్ - మిక్కిలి ఆనందము కల్గెన్ ...
|| స్వ ||
3)నీలముల పునాదులు వేసి-నీలాంజనములతో
మాణిక్యమణులతో - సువర్ణ సునీయములతో
సూర్యకాంతముతో - ప్రశస్త రత్నములతో
ప్రవిమలముగా - నిను కట్టెదను
|| స్వ ||
4)సుమముల హారము - సంతోషానందతైలము నీవె
స్తుతివస్త్రము నీవే - ఉల్లాస వస్త్రంబు నీవే
విడుదలయు నీవే - హితవత్సరము విముక్తి
ఆత్మాభిషేకము నీవే
|| స్వ ||
5)జలములలో బడి దాటునపుడు బలమై యుండెదను
నీతోడై యుండెదను-నదులలో బడి వెళ్ళునపుడు
నీపై పారపు-అగ్ని మధ్యను నడచినను
జ్వాలలు నిను కాల్చగలేవు
|| స్వ ||
6)ఇత్తడి తలుపులు-పగులగొట్టెద-ఇనుప గడియలను
విడగొట్టెదను నేను - అంధకారస్థలములలో నున్నట్టి నిధులను
రహస్యములో మరుగైన - ధనమును నీ కొసంగెదను
|| స్వ ||
7)గర్భమున పుట్టినది మొదలు-తల్లి ఒడిలోన
కూర్చుండునది మొదలు-నేను చంకబెట్టుకొన్న నాదు ప్రజ
లారా-ముదిమి వచ్చువరకు నిన్ను-ఎత్తి కొనువాడను నేనే
|| స్వ ||
English Svacchanda Seeyonuvaasi
ChorusSvachchanda Seeyonuvaasi - Sarvaadhikaari Kastoori Pooraasi
Vartamaana Bhoota Bhavishatkaalavaasee - Alpha Omega -
Taane - Aadyantamu Mana Yese
1)Idigo Nenoka Nibandhananu-Adbhutamuga Jetun
Nee Prajalandariyeduta-Parisodhinpajaalani Mahaa-Panulella
Prabhu Ne-Lekka Leni Adbhutamul - Makkuvato Cheyuvaadu
|| Sva ||
2)Sangeetanaadamulatoda-Seeyonupuramu-Sonpuganu Cheritimi
Saasvata Santoshamu - Maa Siramulapai Velasen - DuHkhamu
Nittoorpunu Poyan - Mikkili Aanandamu Kalgen ...
|| Sva ||
3)Neelamula Punaadulu Vesi-Neelaanjanamulato
Maanikyamanulato - Suvarna Suneeyamulato
Sooryakaantamuto - Prasasta Ratnamulato
Pravimalamugaa - Ninu Kattedanu
|| Sva ||
4)Sumamula Haaramu - Santoshaanandatailamu Neeve
Sthuthivastramu Neeve - Ullaasa Vastranbu Neeve
Vidudalayu Neeve - Hitavatsaramu Vimukti
Aatmaabhishekamu Neeve
|| Sva ||
5)Jalamulalo Badi Daatunapudu Balamai Yundedanu
Neetodai Yundedanu-Nadulalo Badi Vellunapudu
Neepai Paarapu-Agni Madhyanu Nadachinanu
Jvaalalu Ninu Kaalchagalevu
|| Sva ||
6)Ittadi Talupulu-Pagulagotteda-Inupa Gadiyalanu
Vidagottedanu Nenu - Andhakaarasthalamulalo Nunnatti Nidhulanu
Rahasyamulo Marugaina - Dhanamunu Nee Kosangedanu
|| Sva ||
7)Garbhamuna Puttinadi Modalu-Talli Odilona
Koorchundunadi Modalu-Nenu Chankabettukonna Naadu Praja
Laaraa-Mudimi Vachchuvaraku Ninnu-Etti Konuvaadanu Nene
|| Sva ||