Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 350 Old No: 854

నీ నీడలో నా బ్రతుకు

Nee Needalo Naa Bratuku

Open in Word & Worship App
తెలుగు   నీ నీడలో నా బ్రతుకు
పల్లవి
నీ నీడలో నా బ్రతుకు గడవాలని - నీ అడుగుజాడలలో నే నడవాలని
హృదయ వాంఛను కలిగియుంటిని - నీ సహాయము కోరుకుంటిని
1)
నీ యందు నిలిచి ఫలించాలని - ఈ లోక ఆశలు జయించాలని
నీ ప్రేమ నాలో చూపించాలని - నా పొరుగువారిని ప్రేమించాలని
|| హృ ||
2)
నీ సేవలో నే తరించాలని - నీకై శ్రమలను భరించాలని
విశ్వాస పరుగు ముగించాలని - జీవకిరీటము ధరించాలని
|| హృ ||
3)
నీ రూపు నాలో కనిపించాలని - నా అహమంతా నశియించాలని
నీ వార్త ఇలలో ప్రకటించాలని - నీ కడకు ఆత్మల నడిపించాలని
|| హృ ||
English   Nee Needalo Naa Bratuku
Chorus
Nee Needalo Naa Bratuku Gadavaalani - Nee Adugujaadalalo Ne Nadavaalani
Hrudaya Vaanchanu Kaligiyuntini - Nee Sahaayamu Korukuntini
1)
Nee Yandu Nilichi Phalinchaalani - Ee Loka Aasalu Jayinchaalani
Nee Prema Naalo Choopinchaalani - Naa Poruguvaarini Preminchaalani
|| Hru ||
2)
Nee Sevalo Ne Tarinchaalani - Neekai Sramalanu Bharinchaalani
Visvaasa Parugu Muginchaalani - Jeevakireetamu Dharinchaalani
|| Hru ||
3)
Nee Roopu Naalo Kanipinchaalani - Naa Ahamantaa Nasiyinchaalani
Nee Vaarta Ilalo Prakatinchaalani - Nee Kadaku Aatmala Nadipinchaalani
|| Hru ||
Present