Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 349 Old No: 836

సాగేటి ఈ జీవయాత్ర

Saageti Ee Jeevayaatra

Open in Word & Worship App
తెలుగు   సాగేటి ఈ జీవయాత్ర
పల్లవి
సాగేటి ఈ జీవయాత్రలో రేగేటి పెనుతుఫానులెన్నో
ఆదరించవా నీ జీవ వాక్కుతో సేద తీర్చవా నీ చేతి స్పర్శతో
1)
సుడి గుండాలెన్నో లోక సాగరానా - వడిగా నను లాగి పడద్రోసె సమయాన
నడిపించగలిగిన నా చుక్కాని నీవే - విడిపించగలిగే నాకున్న దిక్కు నీవే
యేసయ్యా ఓ...మెస్సయ్యా హల్లెలూయ నీకే స్తోత్రమయా
|| సాగే ||
2)
వడగాలులెన్నో నా పయనములోనా -నడువలేక సొమ్మసిల్ల జేసే సమయానా
తడబాటు తొలగించిన ప్రేమ మూర్తి నీవే
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే
|| సాగే ||
3)
అలలా శ్రమలెన్నో బ్రతుకు నావపైన -చెలరేగి విలవిలలాడించె సమయాన
నిలబెట్టి బలపరచే బలవంతుడ నీవే
కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే
|| సాగే ||
English   Saageti Ee Jeevayaatra
Chorus
Saageti Ee Jeevayaatralo Regeti Penutuphaanulenno
Aadarinchavaa Nee Jeeva Vaakkuto Seda Teerchavaa Nee Cheti Sparsato
1)
Sudi Gundaalenno Loka Saagaraanaa - Vadigaa Nanu Laagi Padadrose
Samayaana
Nadipinchagaligina Naa Chukkaani Neeve - Vidipinchagalige Naakunna Dikku
Neeve
Yesayyaa O...Messayyaa Hallelooya Neeke Stotramayaa
|| Saage ||
2)
Vadagaalulenno Naa Payanamulonaa -Naduvaleka Sommasilla Jese Samayaanaa
Tadabaatu Tolaginchina Prema Moorti Neeve
Kadavaraku Nadipe Immaanuyelu Neeve
|| Saage ||
3)
Alalaa Sramalenno Bratuku Naavapaina -Chelaregi Vilavilalaadinche
Samayaana
Nilabetti Balaparache Balavantuda Neeve
Kalavaramunu Tolaginche Kanna Tandri Neeve
|| Saage ||
Present