తెలుగు యేసుని స్నేహమే మధురము
పల్లవియేసుని స్నేహమే మధురము - మధురము మధురము
క్రీస్తుని స్నేహమే మధురము - మధురము మధురము
1)దైవయానతి దీప్తిలో - దివ్యయాగము తీర్చితివి
కల్వరిలో సిలువపై - రక్తము చిందించి రక్షించితివి
నా కొరకెంతో త్యాగము చేసి - ప్రాణమునిచ్చిన ప్రభు యేసు
|| యేసుని ||
2)నా యాత్మ కాపరి నాధుండవు - నా యండగ నుండి
బ్రోచితివి శోధనలో వ్యాధులలో - బాధలలో బ్రోచితివి
సత్యస్వరూపి నీ సన్నిధిలో - నిత్యము నడుపు నీ నీడలో
|| యేసుని ||
3)మారదు నీ ప్రేమ మారదు - మాన్యుండ నీ ప్రేమ మారదు
నే పాడెద ఈ గీతము - మోక్షపురి మార్గంబున
నీదు దర్శన భాగ్యంబులోన - నా యాత్మ సాఫల్య సౌభాగ్యము
|| యేసుని ||
English Yesuni Snehame Madhuramu
ChorusYesuni Snehame Madhuramu - Madhuramu Madhuramu
Kreestuni Snehame Madhuramu - Madhuramu Madhuramu
1)Daivayaanati Deeptilo - Divyayaagamu Teerchitivi
Kalvarilo Siluvapai - Raktamu Chindinchi Rakshinchitivi
Naa Korakento Tyaagamu Chesi - Praanamunichchina Prabhu Yesu
|| Yesuni ||
2)Naa Yaatma Kaapari Naadhundavu - Naa Yandaga Nundi
Brochitivi Sodhanalo Vyaadhulalo - Baadhalalo Brochitivi
Satyasvaroopi Nee Sannidhilo - Nityamu Nadupu Nee Needalo
|| Yesuni ||
3)Maaradu Nee Prema Maaradu - Maanyunda Nee Prema Maaradu
Ne Paadeda Ee Geetamu - Mokshapuri Maarganbuna
Needu Darsana Bhaagyanbulona - Naa Yaatma Saaphalya Saubhaagyamu
|| Yesuni ||