Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 332 Old No: 239

నా జీవితమంతా నిను

Naa Jeevithamantaa Ninu

Open in Word & Worship App
తెలుగు   నా జీవితమంతా నిను
పల్లవి
నా జీవితమంతా నిను పూజింతును - నా జీవమునకు ఆధారుండ
హృదయపూర్వక వందనములను అందుకొనుము నా యేసువా
1)
మరణపాశములు నన్ను చుట్టుకొనగా - మరణపుటురులు
నన్ను అరికట్టగ - శ్రమలోన నేనుండి మొరపెట్టగ
శీఘ్రముగాను నన్ను విడిపింతివి
|| నా ||
2)
తొలగించితివి నా శిక్షావిధి - జరిగించితివి నీ న్యాయవిధి
కలిగించితివి నాకు స్వర్గస్థితి - చెల్లించెదను నీకు నిత్యం స్తుతి
|| నా ||
3)
ఎవ్వడైనను నిన్ను నమ్ముకొనినచో - వానికి సంపూర్ణశాంతి నిత్తువు
నిత్యాశ్రయ దుర్గమగు నా యేసువా - నిత్యము నిన్ను
నే స్తుతియించెదను
|| నా ||
4)
మహిమోన్నతుండవు నీవై నను - దీనులైన వారిని దృష్టించెదవు
గర్విష్టులైన వారినణగగొట్టి - నీ భక్తులను నీవు ఆదరింతువు
|| నా ||
5)
నీ దరిని నేనున్న తొలగుభయాలు - నీదు దయవల్లనే కలుగు
జయాలు - నిరంతరము నీవు నాకు అండగ నిల్చి
నీతిగ నడుపుము నిత్యుడయేసు
|| నా ||
English   Naa Jeevithamantaa Ninu
Chorus
Naa Jeevitamantaa Ninu Poojintunu - Naa Jeevamunaku Aadhaarunda
Hrudayapoorvaka Vandanamulanu Andukonumu Naa Yesuvaa
1)
Maranapaasamulu Nannu Chuttukonagaa - Maranaputurulu
Nannu Arikattaga - Sramalona Nenundi Morapettaga
Seeghramugaanu Nannu Vidipintivi
|| Naa ||
2)
Tolaginchitivi Naa Sikshaavidhi - Jariginchitivi Nee Nyaayavidhi
Kaliginchitivi Naaku Svargasthiti - Chellinchedanu Neeku Nityan Sthuthi
|| Naa ||
3)
Evvadainanu Ninnu Nammukoninacho - Vaaniki Sanpoornasaanti Nittuvu
Nityaasraya Durgamagu Naa Yesuvaa - Nityamu Ninnu
Ne Sthuthiyinchedanu
|| Naa ||
4)
Mahimonnatundavu Neevai Nanu - Deenulaina Vaarini Drushtinchedavu
Garvishtulaina Vaarinanagagotti - Nee Bhaktulanu Neevu Aadarintuvu
|| Naa ||
5)
Nee Darini Nenunna Tolagubhayaalu - Needu Dayavallane Kalugu
Jayaalu - Nirantaramu Neevu Naaku Andaga Nilchi
Neetiga Nadupumu Nityudayesu
|| Naa ||
Present