తెలుగు నా జీవిత సాగరాన రేగను పెనుగాలి వాన
పల్లవినా జీవిత సాగరాన - రేగెను పెనుగాలి వాన
కలవర పడుచు యున్నాను - నిలువరముగా నుండలేను
1)యేసయ్యా యేసయ్యా - ననుగావగ లేవయ్యా
బాధలు శోధనలే అలలై - నన్ను పెనుగొనె మృత్యువలలై
|| నా ||
2)ఎగసేను ప్రళయ తరంగం - అదిరెను నా అంతరంగం
అల్లాడె నా హృదయ దోనె - నీవు అమరమున తలవాల్చగానే
|| నా ||
3)నశియించి పోవుచున్నాను - నలిగియున్న నీ దాసుడను
శరణంటు వస్తి నీ దరికి - కరుణతో చేర్చుమద్దరికి
|| నా ||
4)విశ్వాసంలో బలహీనుడను - నీ శక్తి నెరుగకున్నాను
బలపరచుము నీ బిడ్డను - నీ సాక్షిగా బ్రతికెదను
|| నా ||
5)ప్రభువు గద్ధించ తుఫాను గడగడలాడి ఆగెను
సాగరము నిమ్మళించెను - నావ నెమ్మదిగా సాగెను
|| నా ||
English Naa Jeevitha Saagaraana Reganu Penugaali Vaana
ChorusNaa Jeevita Saagaraana - Regenu Penugaali Vaana
Kalavara Paduchu Yunnaanu - Niluvaramugaa Nundalenu
1)Yesayyaa Yesayyaa - Nanugaavaga Levayyaa
Baadhalu Sodhanale Alalai - Nannu Penugone Mrtyuvalalai
|| Naa ||
2)Egasenu Pralaya Tarangan - Adirenu Naa Antarangam
Allaade Naa Hrudaya Done - Neevu Amaramuna Talavaalchagaane
|| Naa ||
3)Nasiyinchi Povuchunnaanu - Naligiyunna Nee Daasudanu
Saranantu Vasti Nee Dariki - Karunato Cherchumaddariki
|| Naa ||
4)Visvaasanlo Balaheenudanu - Nee Sakti Nerugakunnaanu
Balaparachumu Nee Biddanu - Nee Saakshigaa Bratikedanu
|| Naa ||
5)Prabhuvu Gaddhincha Tuphaanu Gadagadalaadi Aagenu
Saagaramu Nimmalinchenu - Naava Nemmadigaa Saagenu
|| Naa ||