Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 326 Old No: 205

నడిపించు నా నావ

Nadipinchu Naa Naava

Open in Word & Worship App
తెలుగు   నడిపించు నా నావ
పల్లవి
నడిపించు నా నావా - నడిసంద్రమున దేవా
నవజీవన మార్గమున - నాజన్మ తరియింప
1)
నా జీవిత తీరమున - నా అపజయ భారమున - నలిగిన నా
హృదయమును నడిపించుము లోతునకు - నా ఆత్మ విరబూయ
నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ జేకొనుము
|| నడి ||
2)
రాత్రంతయు శ్రమపడిన - రాలేదు ప్రభూ జయము - రహదారులు
వెదకినను - రాదాయెను ప్రతిఫలము - రక్షించు నీ సిలువ
రమణీయ లోతులలో - రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ
|| నడి ||
3)
ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి - అహమును
ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి - ఆశా నిరాశయే
ఆవేద నెదురాయె - ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడేనానావ
|| నడి ||
4)
ప్రభుమార్గము విడిచితిని - ప్రార్థించుట మానితిని - ప్రభు వాక్యము
వదిలితిని - పరమార్ధము మరచితిని - ప్రపంచ నటనలలో ప్రావీణ్య
మును పొంది ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట
|| నడి ||
5)
లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా లోబడుటకు
నేర్పించి - లోపంబులు సవరించి - లోనున్న ఈవులతో - లోటైన
నా బ్రతుకు లోపించని అర్పణగా - లోకేశ చేయుమయా
|| నడి ||
6)
ప్రభుయేసుని శిష్యుడనై - ప్రభు సేవలో పాదుకొని
ప్రకటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమకథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతున్‌
|| నడి ||
English   Nadipinchu Naa Naava
Chorus
Nadipinchu Naa Naavaa - Nadisandramuna Devaa
Navajeevana Maargamuna - Naajanma Tariyinpa
1)
Naa Jeevita Teeramuna - Naa Apajaya Bhaaramuna - Naligina Naa
Hrudayamunu Nadipinchumu Lotunaku - Naa Aatma Virabooya
Naa Deeksha Phaliyinpa Naa Naavalo Kaalidumu Naa Seva Jekonumu
|| Nadi ||
2)
Raatrantayu Sramapadina - Raaledu Prabhoo Jayamu - Rahadaarulu
Vedakinanu - Raadaayenu Pratiphalamu - Rakshinchu Nee Siluva
Ramaneeya Lotulalo - Ratanaalanu Vedakutalo Raajillu Naa Padava
|| Nadi ||
3)
Aatmaarpana Cheyakaye - Aasinchiti Nee Chelimi - Ahamunu
Preminchuchune - Arasiti Prabhu Nee Kalimi - Aasaa Niraasaye
Aaveda Neduraaye - Aadhyaatmika Lemigani - Allaadenaanaava
|| Nadi ||
4)
Prabhumaargamu Vidichitini - Praarthinchuta Maanitini - Prabhu Vaakyamu
Vadilitini - Paramaardhamu Marachitini - Prapancha Natanalalo Praaveenya
Munu Pondi Phalaheenudanai Yipudu - Paatintu Nee Maata
|| Nadi ||
5)
Lotaina Jalamulalo - Lotuna Vinabadu Svaramaa Lobadutaku
Nerpinchi - Lopanbulu Savarinchi - Lonunna Eevulato - Lotaina
Naa Bratuku Lopinchani Arpanagaa - Lokesa Cheyumayaa
|| Nadi ||
6)
Prabhuyesuni Sishyudanai - Prabhu Sevalo Paadukoni
Prakatintunu Lokamulo - Parisuddhuni Premakatha
Paramaatma Prokshanato Paripoorna Samarpanato
Praananbunu Prabhu Koraku Paanaarpanamu Chetun
|| Nadi ||
Present