Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 325 Old No: 161

విడువవు నన్నిక ఎన్నడైనను

Viduvavu Nannika Ennudainanu

Open in Word & Worship App
తెలుగు   విడువవు నన్నిక ఎన్నడైనను
పల్లవి
విడువవు నన్నిక ఎన్నడైనను - పడిపోకుండా కాయు రక్షకా
పడిపోవు వారెల్లరిని లేపెడివాడవు నీవే ప్రభూ
1)
ప్రభువా నీకవిధేయుడనై - పలుమారులు పడు సమయములో
ప్రేమతో జాలి దీనస్వరముతో - ప్రియుడా నను పైకెత్తితివి
|| విడువ ||
2)
ఆదాము హవ్వలు ఏదెనులో - ఆశతో ఆజ్ఞ మీరిననూ
సిలువకు ఛాయగ బలి నర్పించి - ప్రియముగా విమోచించితివి
|| విడువ ||
3)
మోషేకు నీ దర్శనమిచ్చి - నీ ప్రజలను నడిపించుటకై
సాకులు చెప్పిన విడువక తననే - నాయకునిగ నియమించితివి
|| విడువ ||
4)
స్వంత తలంపున దావీదు - మందసమును తెచ్చునపుడు
ఉజ్జా మరణముచే దావీదు - హృదయమును కదిలించితివి
|| విడువ ||
5)
నీ మాటలు వినక యోనా తర్నీషుకు తరలినపుడు
సముద్రములో మునుగుచుండగ - చేపద్వారా దరి చేర్చితివి
|| విడువ ||
6)
నిన్నెన్నడు యెడబాయనని - నిక్కముగ పేతురు బలికె
ముమ్మారు బొంకినను విడువక - ప్రేమతో చేరదీసితివి
|| విడువ ||
7)
మా శక్తియు మా భక్తియు కాదు - ఇలలో జీవించుట ప్రభువా
కొల్లగ నీ యాత్మను నొసగితివి - హల్లెలూయా పాడెదను
|| విడువ ||
English   Viduvavu Nannika Ennudainanu
Chorus
Viduvavu Nannika Ennadainanu - Padipokundaa Kaayu Rakshakaa
Padipovu Vaarellarini Lepedivaadavu Neeve Prabhoo
1)
Prabhuvaa Neekavidheyudanai - Palumaarulu Padu Samayamulo
Premato Jaali Deenasvaramuto - Priyudaa Nanu Paikettitivi
|| Viduva ||
2)
Aadaamu Havvalu edenulo - Aasato Aagnaa Meerinanoo
Siluvaku Chaayaga Bali Narpinchi - Priyamugaa Vimochinchitivi
|| Viduva ||
3)
Mosheku Nee Darsanamichchi - Nee Prajalanu Nadipinchutakai
Saakulu Cheppina Viduvaka Tanane - Naayakuniga Niyaminchitivi
|| Viduva ||
4)
Svanta Talanpuna Daaveedu - Mandasamunu Techchunapudu
Ujjaa Maranamuche Daaveedu - Hrudayamunu Kadilinchitivi
|| Viduva ||
5)
Nee Maatalu Vinaka Yonaa Tarneeshuku Taralinapudu
Samudramulo Munuguchundaga - Chepadvaaraa Dari Cherchitivi
|| Viduva ||
6)
Ninnennadu Yedabaayanani - Nikkamuga Peturu Balike
Mummaaru Bonkinanu Viduvaka - Premato Cheradeesitivi
|| Viduva ||
7)
Maa Saktiyu Maa Bhaktiyu Kaadu - Ilalo Jeevinchuta Prabhuvaa
Kollaga Nee Yaatmanu Nosagitivi - Hallelooyaa Paadedanu
|| Viduva ||
Present