తెలుగు దయామయా మా యేసయ్య
పల్లవిదయామయా మా యేసయ్యా - మా స్తుతులనందుకో
1)పాపపు మలినంబుతో - నల్లని మనంబుతో
మలినమైన బ్రతుకుతో- నలిగి కుములుచుండగ
విలువగు నీ రక్తంబుతో - వెలిగించినావుగా
|| దయా ||
2)ప్రాణమిచ్చినట్టి ఓ - మంచి గొఱ్ఱెలకాపరి
మృతిని గెల్చి లేచిన - గొప్ప గొఱ్ఱెల కాపరి
పరమ భాగ్య మొసగిన - ప్రధాన కాపరి
|| దయా ||
3)మందభాగ్యులమైన మాకు - విందుభాగ్య మొసగితివి
విందులో కూర్చుండగ - పరిమళము వ్యాపించెగా
విందుశాలలోన - ప్రేమధ్వజము నెత్తితివి
|| దయా ||
4)అతిమనోహరుండవు - అతి కాంక్షణీయుడవు
పదివేలమందిలో - గుర్తింపదగిన వాడవు
నీవు మారిపోయి మాకు సొగసు నొసగితివి
|| దయా ||
5)ద్రాక్షరసముకన్న నీదు - ప్రేమ ఎంతో మధురము
జుంటితేనె ధారకన్న - నీదు వాక్కు మధురము
మాతృ ప్రేమకన్న నీదు - ప్రేమ మధురము
|| దయా ||
6)ప్రాణప్రియుడ యేసువా - నీవెపుడు తిరిగి వత్తువో
మర్త్య దేహమందున - మూల్గుచుంటిమో ప్రభూ
త్వరగ వచ్చి మమ్ము నీ దరికి జేర్చుకో
|| దయా ||
English Dayaamayaa Maa Yesayya
ChorusDayaamayaa Maa Yesayyaa - Maa Stutulananduko
1)Paapapu Malinanbuto - Nallani Mananbuto
Malinamaina Bratukuto- Naligi Kumuluchundaga
Viluvagu Nee Raktanbuto - Veliginchinaavugaa
|| Dayaa ||
2)Praanamichchinatti O - Manchi Gorrelakaapari
Mrtini Gelchi Lechina - Goppa Gorrela Kaapari
Parama Bhaagya Mosagina - Pradhaana Kaapari
|| Dayaa ||
3)Mandabhaagyulamaina Maaku - Vindubhaagya Mosagitivi
Vindulo Koorchundaga - Parimalamu Vyaapinchegaa
Vindusaalalona - Premadhvajamu Nettitivi
|| Dayaa ||
4)Atimanoharundavu - Ati Kaankshaneeyudavu
Padivelamandilo - Gurtinpadagina Vaadavu
Neevu Maaripoyi Maaku Sogasu Nosagitivi
|| Dayaa ||
5)Draaksharasamukanna Needu - Prema Ento Madhuramu
Juntitene Dhaarakanna - Needu Vaakku Madhuramu
Maatru Premakanna Needu - Prema Madhuramu
|| Dayaa ||
6)Praanapriyuda Yesuvaa - Neevepudu Tirigi Vattuvo
Martya Dehamanduna - Moolguchuntimo Prabhoo
Tvaraga Vachchi Mammu Nee Dariki Jerchuko
|| Dayaa ||