Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 315

కల్వరి ప్రేమ కడువింత

Kalvari Prema Kaduvinta

Open in Word & Worship App
తెలుగు   కల్వరి ప్రేమ కడువింత
పల్లవి
కల్వరి ప్రేమ - కడు వింత ప్రేమ
కాపరి ప్రేమ - నా యేసు ప్రేమ
1)
పడిచెడిన వారి కొరకు - పరుగిడిన ప్రేమ
కడు ఘోర పాపులకై మొరలిడిన ప్రేమ
కొరడాల దెబ్బలే - తనువంత చీల్చగా
తడబడుచు మెడవంచి - నా సిలువ మోసెగ
|| కల్వరి ||
2)
ఏ యోగ్యతే లేని - నా కొరకు త్యాగమా
ఎందుకో ఇంతగాను - ప్రేమించెనే నన్ను
కనలేను ఇలయందైన - ఈ గొప్ప ప్రేమను
కడ ఊపిరి దాకా - ప్రేమింతునూ నిన్ను
|| కల్వరి ||
3)
అక్షయమైన ప్రేమ - రక్షకుని ప్రేమ
అత్యున్నతమైన ప్రేమ - ఉన్నతుని ప్రేమ
కాంక్షింతును ప్రతిక్షణము - ఆమధుర ప్రేమను
దీక్షతో చాటింతు - ఇల యేసు ప్రేమను
|| కల్వరి ||
English   Kalvari Prema Kaduvinta
Chorus
Kalvari Prema - Kadu Vinta Prema
Kaapari Prema - Naa Yesu Prema
1)
Padichedina Vaari Koraku - Parugidina Prema
Kadu Ghora Paapulakai Moralidina Prema
Koradaala Debbale - Tanuvanta Cheelchagaa
Tadabaduchu Medavanchi - Naa Siluva Mosega
|| Kalvari ||
2)
e Yogyate Leni - Naa Koraku Tyaagamaa
Enduko Intagaanu - Preminchene Nannu
Kanalenu Ilayandaina - Ee Goppa Premanu
Kada Oopiri Daakaa - Premintunoo Ninnu
|| Kalvari ||
3)
Akshayamaina Prema - Rakshakuni Prema
Atyunnatamaina Prema - Unnatuni Prema
Kaankshintunu Pratikshanamu - Aamadhura Premanu
Deekshato Chaatintu - Ila Yesu Premanu
|| Kalvari ||
Present