Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 306 Old No: 767

యేసుప్రభువా నీదు ప్రేమను

Yesuprabhuvaa Needu Premanu

Open in Word & Worship App
తెలుగు   యేసుప్రభువా నీదు ప్రేమను
పల్లవి
యేసుప్రభువా! నీదు ప్రేమను ఏమని వర్ణింతుము
జ్ఞానమునకు మించిపోయెను కల్వరిగిరి గానము
1)
అంతరిక్షము - ఆకసమును పట్టజాలని దేవుడా! పశుల పాకలో
చిన్న శిశువుగ జన్మించి యుంటివే
|| యేసు ||
2)
అధిక సుందర రూపుడా నీ ఆననముపై నుమిసినన్‌
ఎనలేని ప్రేమజూపి వేడుకొంటివి తండ్రిని
|| యేసు ||
3)
మణులు మాణిక్యములు దాపినకనక మకుటపు ధారుడా
మూర్ఖులను రక్షించుటకు ఆ ముండ్ల మకుటము దాల్చితివి
|| యేసు ||
4)
మేలు చేసిన కాళ్ళు చేతుల మేకులన్‌ దిగ గొట్టినన్‌ ఖలుల కొఱకై
గాయపడి నీకరుణ జూపిన రక్షకా!
|| యేసు ||
5)
పేమపూర్ణ హృదయుడా! నీ ప్రక్క బొడచిన వెంటనే
నీరు రక్తము ధారవోసి ముక్తి మార్గము జూపితివి
|| యేసు ||
6)
పాపులను పరిశుద్ధులనుగా తీర్చి దిద్దిన రక్షకా రాజులన్‌
యాజకుల జేసి పరమ భాగ్యము నిస్తివి
|| యేసు ||
7)
హల్లెలూయ స్తోత్రపాటలు, ఎల్లవేళల పాడెదమ్‌
మృత్యు విజయుండేసుడే - మననిత్యుడైన తండ్రియౌ
|| యేసు ||
English   Yesuprabhuvaa Needu Premanu
Chorus
Yesuprabhuvaa! Needu Premanu emani Varnintumu
Gnaanamunaku Minchipoyenu Kalvarigiri Gaanamu
1)
Antarikshamu - Aakasamunu Pattajaalani Devudaa! Pasula Paakalo
Chinna Sisuvuga Janminchi Yuntive
|| Yesu ||
2)
Adhika Sundara Roopudaa Nee Aananamupai Numisinan
Enaleni Premajoopi Vedukontivi Tandrini
|| Yesu ||
3)
Manulu Maanikyamulu Daapinakanaka Makutapu Dhaarudaa
Moorkhulanu Rakshinchutaku Aa Mundla Makutamu Daalchitivi
|| Yesu ||
4)
Melu Chesina Kaallu Chetula Mekulan Diga Gottinan Khalula Korakai
Gaayapadi Neekaruna Joopina Rakshakaa!
|| Yesu ||
5)
Pemapoorna Hrudayudaa! Nee Prakka Bodachina Ventane
Neeru Raktamu Dhaaravosi Mukti Maargamu Joopitivi
|| Yesu ||
6)
Paapulanu Parisuddhulanugaa Teerchi Diddina Rakshakaa Raajulan
Yaajakula Jesi Parama Bhaagyamu Nistivi
|| Yesu ||
7)
Hallelooya Stotrapaatalu, Ellavelala Paadedam
Mrtyu Vijayundesude - Mananityudaina Tandriyau
|| Yesu ||
Present