Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 305 Old No: 764

వింత్రైన నీ ప్రేమా

Vimtraina Nee Premaa

Open in Word & Worship App
తెలుగు   వింత్రైన నీ ప్రేమా
పల్లవి
వింతైన నీ.... ప్రేమా వివరింతునా....
నీ... వింతైన నీ ప్రేమా వివరింతునా
1)
సింహాసనంబు - విడచి ఆ సిలువనెక్కినావు
నా కలుషములను బాపన్‌ పలుబాధలొందినావు
|| వింతైన ||
2)
దేవాది దేవుడవు ఈ దీన పాపి - కొఱకే
హీనుండ వోలె సిలువన్‌ వ్రేలాడి సమసి నావు
|| వింతైన ||
3)
వధ గొఱ్ఱె పిల్ల వలెనే వధియింప బడితివయ్యా
నా విధికి సిలువపైన రుధిరంబు గార్చినావు
|| వింతైన ||
4)
ఈ ఘోర పాపి కొఱకే నరరూప మెత్తినావు
మరణించి బ్రతికి నావు పరలోక మేగినావు
|| వింతైన ||
5)
పాపంబులెన్నో జేసి, అపరాధములను జేసి
చనిపోతినయ్య నేను బ్రతికించినావు దేవా
|| వింతైన ||
6)
అనుదినము నన్ను నీదు కనుపాప వలెను గాచి
తనయుండ జేసినావు ఘన పరచినావు దేవా
|| వింతైన ||
7)
రాజులకు రాజువనుచు, దేవాది దేవుడవనుచు
నీ పాద పూజ సేతున్‌ స్తుతియింతు నేసు ప్రభువా
|| వింతైన ||
English   Vimtraina Nee Premaa
Chorus
Vintaina Nee.... Premaa Vivarintunaa....
Nee... Vintaina Nee Premaa Vivarintunaa
1)
Sinhaasananbu - Vidachi Aa Siluvanekkinaavu
Naa Kalushamulanu Baapan Palubaadhalondinaavu
|| Vintaina ||
2)
Devaadi Devudavu Ee Deena Paapi - Korake
Heenunda Vole Siluvan Vrelaadi Samasi Naavu
|| Vintaina ||
3)
Vadha Gorre Pilla Valene Vadhiyinpa Baditivayyaa
Naa Vidhiki Siluvapaina Rudhiranbu Gaarchinaavu
|| Vintaina ||
4)
Ee Ghora Paapi Korake Nararoopa Mettinaavu
Maraninchi Bratiki Naavu Paraloka Meginaavu
|| Vintaina ||
5)
Paapanbulenno Jesi, Aparaadhamulanu Jesi
Chanipotinayya Nenu Bratikinchinaavu Devaa
|| Vintaina ||
6)
Anudinamu Nannu Needu Kanupaapa Valenu Gaachi
Tanayunda Jesinaavu Ghana Parachinaavu Devaa
|| Vintaina ||
7)
Raajulaku Raajuvanuchu, Devaadi Devudavanuchu
Nee Paada Pooja Setun Sthuthiyintu Nesu Prabhuvaa
|| Vintaina ||
Present