Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 302 Old No: 719

నీతో సమామేవరు

Neeto Samamevaru

Open in Word & Worship App
తెలుగు   నీతో సమామేవరు
పల్లవి
నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు
నీలా క్షమియించేదెవరో యేసయ్యా ...ఆ...
నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు
1)
లోక బంగారము - ధన ధాన్యాదులు
ఒక పోగేసినా - నీతో సరితూగునా
లోక నదులన్నియు - సర్వ సంద్రములై
ఒక్కటై ఎగసినా నిన్ను తాకగలవా
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించినా నీవేగా చాలిన దేవుడవు
|| నీతో ||
2)
పలువేదాలలో మత గ్రంధాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి
పాపపరిహారార్ధం సిలువ మరణమొంది
తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయా నీవేగా విమోచకుడవు
|| నీతో ||
3)
నేను వెదకకున్నా నాకు దొరికితివి - నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి
నీకు గాయాలు చేసి తరచు రేపితిని - నన్నెంతో సహించి క్షమించితివి
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు
|| నీతో ||
English   Neeto Samamevaru
Chorus
Neeto Samamevaru Neelaa Preminchedevaru
Neelaa Kshamiyinchedevaro Yesayyaa ...Aa...
Neelaa Paapikai Praanan Pettina Vaarevaru
1)
Loka Bangaaramu - Dhana Dhaanyaadulu
Oka Pogesinaa - Neeto Saritoogunaa
Loka Nadulanniyu - Sarva Sandramulai
Okkatai Egasinaa Ninnu Taakagalavaa
Loka Saukhyaalannee Oka Chota Kummarinchinaa Neevegaa Chaalina Devudavu
|| Neeto ||
2)
Paluvedaalalo Mata Grandhaalalo Paapame Sokani Parisuddhudedi
Paapaparihaaraardhan Siluva Maranamondi
Tirigi Lechinatti Daivanarudevvaru
Neelaa Parisudha Devudevarunnaarayaa Neevegaa Vimochakudavu
|| Neeto ||
3)
Nenu Vedakakunnaa Naaku Dorikitivi - Ne Preminchakunnaa Nannu
Preminchitivi
Neeku Gaayaalu Chesi Tarachu Repitini - Nannento Sahinchi Kshaminchitivi
Neelaa Jaaligala Premagala Devudedi Neevegaa Vimochakudavu
|| Neeto ||
Present