Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 3

రండి యుత్సాహించి పాడుదము

Randi Yutsaahinchi Paadudamu

♪ సమూయేలు పాక్యనాధము ఆ.కృ.కీ♪ Samuel Paakyanaadhamu
Open in Word & Worship App
తెలుగు   రండి యుత్సాహించి పాడుదము
పల్లవి
రండి యుత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే
1)
రండి కృతాజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభు నామమును కీర్తనలన్ - సంతోషగానము చేయుదము
|| రం ||
2)
మన ప్రభువే మహా దేవుండు - ఘనమహాత్యము గలరాజ
భూమ్యాగాధపు లోయలును - భూదర శిఖరము లాయనవే
|| రం ||
3)
సముద్రము సృష్టించె నాయనయే - సత్యుని హస్తమే భువిజేసన్
ఆయన దైవము పాలితుల - ఆయన మేపెడి గొఱ్ఱెలము
|| రం ||
4)
ఆ ప్రభు సన్నిధి మొకరించి - ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు గైకొనిన - నయ్యవి మనకెంతో మేలగును
|| రం ||
5)
తండ్రి కుమార శుద్ధాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని నిప్పుడు నెల్లపుడు నయినట్లు యుగముల నౌనామెన్
|| రం ||
English   Randi Yutsaahinchi Paadudamu
Chorus
Randi Yutsaahinchi Paadudamu - Rakshana Durgamu Mana Prabhuve
1)
Randi Krutaagnaata Stotramuto - Raaraaju Sannidhi Kegudamu
Satprabhu Naamamu Keertanalan - Santoshagaanamu Cheyudamu
|| Ran ||
2)
Mana Prabhuve Mahaa Devundu - Ghanamahaatyamu Galaraaju
Bhoomyaagaadhapu Loyalunu - Bhoodara Sikharamu Laayanave
|| Ran ||
3)
Samudramu Srushtinche Naayanaye - Satyuni Hastame Bhuvijesen
Aayana Daivamu Paalitula - Aayana Mepedi Gorrelamu
|| Ran ||
4)
Aa Prabhu Sannidhi Mokarinchi - Aayana Mundara Mrokkudamu
Aayana Maatalu Gaikonina - Nayyavi Manakento Melagunu
|| Ran ||
5)
Tandri Kumaara Sudhaatmakunu - Dagu Sthuthi Mahimalu Kalgugaaka
Aadini Nippudu Nellapudu Nayinatlu Yugamula Naunaamen
|| Ran ||
Present