Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 297 Old No: 540

ఆరని ప్రేమ ఇది

Aarani Prema Idi

Open in Word & Worship App
తెలుగు   ఆరని ప్రేమ ఇది
పల్లవి
ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల యిది
అతి శ్రేష్ఠమయినది - అంతమే లేనిది
అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ యిది
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ యిది
1)
సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా - మృతిని గెలిచి లేచినది
ఇది సజీవమైనది - ఇది సత్యమైనది - ఇది నిత్యమైనది
క్రీస్తు యేసు ప్రేమ యిది
కలువరి ప్రేమ యిది - క్రీస్తు కలువరి ప్రేమ యిది
|| ఆరని ||
2)
నా స్థాన మందు నిలిచి - నా శిక్షనే భరియించి
క్రయ ధనము చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది
నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది
ఉన్నత ప్రేమ యిది - అత్యున్నత ప్రేమ యిది
|| ఆరని ||
3)
భూరాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు
చెరయైనా - ఖడ్గమైనా - కరువైనా ఎదురైనా
ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది - ప్రతి పాపి చెంతకు
ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది
|| ఆరని ||
English   Aarani Prema Idi
Chorus
Aarani Prema Idi - Aarpajaalani Jvaala Yidi
Ati Sreshthamayinadi - Antame Lenidi
Avadhule Lenidi - Akshayamaina Prema Yidi
Kaluvari Prema Idi - Kreestu Kaluvari Prema Yidi
1)
Sinhaasanamu Nundi Siluvaku Digi Vachchinadi
Balamainadi Maranamu Kannaa - Mrtini Gelichi Lechinadi
Idi Sajeevamainadi - Idi Satyamainadi - Idi Nityamainadi
Kreestu Yesu Prema Yidi
Kaluvari Prema Yidi - Kreestu Kaluvari Prema Yidi
|| Aarani ||
2)
Naa Sthaana Mandu Nilichi - Naa Sikshane Bhariyinchi
Kraya Dhanamu Chellinchi - Goppa Rakshana Nichchinadi
Naaku Viluva Nichchinadi - Nannu Veliginchinadi
Unnata Prema Yidi - Atyunnata Prema Yidi
|| Aarani ||
3)
Bhooraajulu Adhipatulu - Raajyaalu Adhikaaraalu
Cherayainaa - Khadgamainaa - Karuvainaa Edurainaa
Evaru Aarpalenidi - Evaru Aapalenidi
Pravahinchuchunnadi - Prati Paapi Chentaku
Prema Pravaahamidi - Yesu Prema Pravaahamidi
|| Aarani ||
Present