Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 296 Old No: 539

నిర్హేతుకముగా ప్రేమించితివి

Nirhetukamugaa Preminicitivii

Open in Word & Worship App
తెలుగు   నిర్హేతుకముగా ప్రేమించితివి
పల్లవి
నిర్హేతుకముగా ప్రేమించితివి - ఏలాగు తీర్తును నీ ఋణమును దేవా
ఏ రీతి వర్ణింతు నీ ప్రేమను - ఏ రీతి స్మరియింతు నీ ప్రేమను
1)
జన్మంబుతోనే పాపిని - కర్మంబుతోనే దోషిని స్రవియించె నాదు
మూర్ఖత్వము దుర్వాసన గలదై స్రావముగా
|| నిర్హే ||
2)
చచ్చిన శవము వంటివాడను - కుళ్ళిన కుక్క వంటివాడను కొంచెమైన
మంచి లేదు ఎటుచూచిన - నిలువెల్ల చెడిపోయిన వాడను
|| నిర్హే ||
3)
తల్లిదండ్రులు విడనాడినా - బంధు మిత్రులు బహుదూరమైన
ఆప్తులందరు అనాధగా వీడినా - ఆదుకొంటివి ఈ దీన పాపిని
|| నిర్హే ||
4)
ఏ మంచి చూచి ప్రేమించితివో - పరదేశినని దయ చూపితివో ఏ
సుఖము కోరి నన్ను దరి చేర్చితివో - దీనరక్షకా నా ప్రాణనాధుడా
|| నిర్హే ||
5)
మహిమను విడచితివి - నాకై మరణించి లేచితివి నీ మరణము
ద్వారానే నాకు నిత్యజీవము - మన లేను నేనెన్నడు నీ ప్రేమను
|| నిర్హే ||
English   Nirhetukamugaa Preminicitivii
Chorus
Nirhetukamugaa Preminchitivi - elaagu Teertunu Nee Runamunu Devaa
e Reeti Varnintu Nee Premanu - e Reeti Smariyintu Nee Premanu
1)
Janmanbutone Paapini - Karmanbutone Doshini Sraviyinche Naadu
Moorkhatvamu Durvaasana Galadai Sraavamugaa
|| Nirhe ||
2)
Chachchina Savamu Vantivaadanu - Kullina Kukka Vantivaadanu Konchemaina
Manchi Ledu Etuchoochina - Niluvella Chedipoyina Vaadanu
|| Nirhe ||
3)
Tallidandrulu Vidanaadinaa - Bandhu Mitrulu Bahudooramaina
Aaptulandaru Anaadhagaa Veedinaa - Aadukontivi Ee Deena Paapini
|| Nirhe ||
4)
e Manchi Choochi Preminchitivo - Paradesinani Daya Choopitivo e
Sukhamu Kori Nannu Dari Cherchitivo - Deenarakshakaa Naa Praananaadhudaa
|| Nirhe ||
5)
Mahimanu Vidachitivi - Naakai Maraninchi Lechitivi Nee Maranamu
Dvaaraane Naaku Nityajeevamu - Mana Lenu Nenennadu Nee Premanu
|| Nirhe ||
Present