తెలుగు జ్ఞానమునకు మించిన
పల్లవిజ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ
జ్ఞానులు గ్రహించలేని యేసు ప్రేమ
జీవము నర్పించిన - జీవింపజేసిన ప్రేమ (2)
ఉర్విని గెలిచిన ప్రేమ - ఉర్విలో దొరకని క్రమ (2)
ఊహకు అతీతమైన - నా యేసు ప్రేమ (2)
1)ద్రోహియైన యూదాను - స్నేహితుడని పిలచిన ప్రేమ
బొంకిన పేతురువైపు దయతో - చూచిన ప్రేమ (2)
సందేహించిన తోమాను - సంధించిన ఘన ప్రేమ (2)
ద్రోహము నోర్చిన ప్రేమ - దయ చూపించిన ప్రేమ
దాపునచేరిన ప్రేమ - నా యేసుప్రేమ (2)
2)సిలువను వేసినవారికి క్షమియించుమని పలికిన ప్రేమ
హేళనచేసిన దూషకులన్ - సహియించిన ఘన ప్రేమ (2)
ప్రతివారిని రక్షింపను - చేతులు చాచిన ప్రేమ (2)
నన్ను రక్షించిన ప్రేమ - నన్ను సహించిన ప్రేమ
చేతులు చాచిన ప్రేమ - నా యేసు ప్రేమ (2)
3)నీవు దేవుని మరచినను - నిన్ను మరువని ప్రేమ (2)
నీ హృదయము వాకిలిచెంత - ఓపికతో నిలిచిన ప్రేమ
ఈ ప్రేమను పొందగను - తెరువుము నీ హృదయమును
నిన్ను మరువని ప్రేమ - నీకై వేచిన ప్రేమ
హృదయము కోరిన ప్రేమ - నా యేసుప్రేమ
English Gnaanamunaku Minchina
ChorusGnaanamunaku Minchina Kreestu Prema
Gnaanulu Grahinchaleni Yesu Prema
Jeevamu Narpinchina - Jeevinpajesina Prema (2)
Urvini Gelichina Prema - Urvilo Dorakani Krama (2)
Oohaku Ateetamaina - Naa Yesu Prema (2)
1)Drohiyaina Yoodaanu - Snehitudani Pilachina Prema
Bonkina Peturuvaipu Dayato - Choochina Prema (2)
Sandehinchina Tomaanu - Sandhinchina Ghana Prema (2)
Drohamu Norchina Prema - Daya Choopinchina Prema
Daapunacherina Prema - Naa Yesuprema (2)
2)Siluvanu Vesinavaariki Kshamiyinchumani Palikina Prema
Helanachesina Dooshakulan - Sahiyinchina Ghana Prema (2)
Prativaarini Rakshinpanu - Chetulu Chaachina Prema (2)
Nannu Rakshinchina Prema - Nannu Sahinchina Prema
Chetulu Chaachina Prema - Naa Yesu Prema (2)
3)Neevu Devuni Marachinanu - Ninnu Maruvani Prema (2)
Nee Hrudayamu Vaakilichenta - Opikato Nilichina Prema
Ee Premanu Pondaganu - Teruvumu Nee Hrudayamunu
Ninnu Maruvani Prema - Neekai Vechina Prema
Hrudayamu Korina Prema - Naa Yesuprema