తెలుగు దేవా నా ప్రభువా నిను గూర్చి
పల్లవిదేవా నా ప్రభువా నినుగూర్చి ఉప్పొంగె నా హృదయం
1)నీ నామమును నే ఘనపరచి హెచ్చించి పూజింతున్
శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై
|| దేవా ||
2)ఎండిన భూమిలో లేతమొక్కవలె పలుశ్రమలను పొందితివి
వ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది నా శిక్షను పొందితివి
|| దేవా ||
3)ధవళవర్ణుడ రత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవె ప్రభూ
పదివేలలో నిను గుర్తించెదను నా పరమ పితా నిన్ను
|| దేవా ||
4)గొఱ్ఱెపిల్ల పెండ్లివిందునందు రారాజు రూపమును
నిరతంబును చూచే నిరీక్షణతో నింగిని నే జూచెదను
|| దేవా ||
English Devaa Naa Prabhuvaa Ninu Goorchi
ChorusDevaa Naa Prabhuvaa Ninugoorchi Upponge Naa Hrudayam
1)Nee Naamamunu Ne Ghanaparachi Hechchinchi Poojintun
Slaaghinchi Koniyaadutalo Naakichchina Nee Krupakai
|| Devaa ||
2)Endina Bhoomilo Letamokkavale Palusramalanu Ponditivi
Vyasanaakraantudavai Vyaadhinondi Naa Sikshanu Ponditivi
|| Devaa ||
3)Dhavalavarnuda Ratnavarnudavu Naa Priyudavu Neeve Prabhoo
Padivelalo Ninu Gurtinchedanu Naa Parama Pitaa Ninnu
|| Devaa ||
4)Gorrepilla Pendlivindunandu Raaraaju Roopamunu
Niratanbunu Chooche Nireekshanato Ningini Ne Joochedanu
|| Devaa ||