తెలుగు నా యేసుని జాలి ప్రేమ
పల్లవినా యేసుని జాలి ప్రేమే - నన్ను రక్షించెను
ఆ ఘోర కల్వరిగిరిలో - ప్రాణమర్పించగా
1)శాశ్వితంబగు ప్రేమతోడ - నన్ను ప్రేమించి
విడువక నాయందు తన కృప - జూపియుండెను
|| నా ||
2)గొఱ్ఱెవలె నే త్రోవ తప్పి - తిరుగుచుంటిని,
వెదకి, వెదకి వెంబడించి - నన్ను కనుగొనెను
|| నా ||
3)పాపినై నేనింక నుండ - ప్రాణమొసగెనుగా,
ప్రేమను నాయందు విభుడే - వెల్లడించెను
|| నా ||
4)అద్వితీయ కుమారుడాయన - యందు నమ్మితిని,
నిత్య జీవము నాకు పంచి దాచియుండెను
|| నా ||
5)ప్రాణమివ్వగనాదు సోదర - ప్రియులకై ప్రభువు
తనదు ప్రేమ నాలో నింపి - నిలిపె తన కృపలో
|| నా ||
6)ఆనందం నాకానందంబు - హల్లెలూయ స్తుతుల్
పరమ యెరూషలేము నాకై - నిలిచి యుండగను
|| నా ||
English Naa Yesuni Jaali Prema
ChorusNaa Yesuni Jaali Preme - Nannu Rakshinchenu
Aa Ghora Kalvarigirilo - Praanamarpinchagaa
1)Saasvitanbagu Prematoda - Nannu Preminchi
Viduvaka Naayandu Tana Krupa - Joopiyundenu
|| Naa ||
2)Gorrevale Ne Trova Tappi - Tiruguchuntini,
Vedaki, Vedaki Venbadinchi - Nannu Kanugonenu
|| Naa ||
3)Paapinai Neninka Nunda - Praanamosagenugaa,
Premanu Naayandu Vibhude - Velladinchenu
|| Naa ||
4)Adviteeya Kumaarudaayana - Yandu Nammitini,
Nitya Jeevamu Naaku Panchi Daachiyundenu
|| Naa ||
5)Praanamivvaganaadu Sodara - Priyulakai Prabhuvu
Tanadu Prema Naalo Ninpi - Nilipe Tana Krupalo
|| Naa ||
6)Aanandan Naakaanandanbu - Hallelooya Stutul
Parama Yerooshalemu Naakai - Nilichi Yundaganu
|| Naa ||