Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 281 Old No: 127

ఓ నమ్మకమైన మా యేసు

O Nammakamaina Maa Yesu

Open in Word & Worship App
తెలుగు   ఓ నమ్మకమైన మా యేసు
పల్లవి
ఓ నమ్మకమైన మా యేసు - నీ ప్రేమకు సాటిలేదిలలో
మా నమ్మిక నిరీక్షణకన్న నీ ప్రేమయే శ్రేష్ఠము మా ప్రభువా
1)
ఓ దేవ నీదు ప్రేమచే - పాపులమగు మాకై మరణించి
నీ దివ్య రక్తముచేతనే మా పాపములు కడిగితివయ్యా
ఆ - ఆ - ఓ దీనబాంధవ మా యేసు
నీయమూల్య ప్రేమకు మా స్తుతులు
|| ఓ ||
2)
వరంబులన్ని కలిగున్నన్‌ - మర్మంబులన్ని ఎరిగున్నన్‌
విశ్వాస వీరుండనైనన్‌ - మహాబలవంతుడనైనన్‌ - ఆ - ఆ
విలువగు నీ ప్రేమలేనిచో మ్రోగెడి కంచుతాళము నగుదున్‌
|| ఓ ||
3)
ప్రేమ మత్సరపడదు - త్వరగాను కోపపడదు - అమర్యాదగను
నడువదు - దుర్నీతిలో సంతోషపడదు - ఆ - ఆ
ప్రేమ నిరతముండును దీర్ఘకాలము సహించును
|| ఓ ||
4)
చూచెడి నరుని ప్రేమింపక - చూడని నిన్ను ప్రేమింపలేము
చూడని నిన్ను ప్రేమించిన - చూచెడి నరుని ప్రేమింపవలెన్‌
ఆ - ఆ - చిత్తమున నీ ప్రేముంటే - చిరకాలము
జీవింతుము దేవా
|| ఓ ||
5)
నీ యాజ్ఞల గైకొని నడచుటే - పరిపూర్ణ ప్రేమ మా ప్రభువా
నీ యద్భుత ప్రేమ ఒక్కటే - ఒకరినొకరము ప్రేమించుటే
ఆ - ఆ - ఓ ప్రేమాస్వరూపి మా యేసు - నీ ప్రేమను
చాటెదము భువిలో
|| ఓ ||
English   O Nammakamaina Maa Yesu
Chorus
O Nammakamaina Maa Yesu - Nee Premaku Saatiledilalo
Maa Nammika Nireekshanakanna Nee Premaye Sreshthamu Maa Prabhuvaa
1)
O Deva Needu Premache - Paapulamagu Maakai Maraninchi
Nee Divya Raktamuchetane Maa Paapamulu Kadigitivayyaa
Aa - Aa - O Deenabaandhava Maa Yesu
Neeyamoolya Premaku Maa Stutulu
|| O ||
2)
Varanbulanni Kaligunnan - Marmanbulanni Erigunnan
Visvaasa Veerundanainan - Mahaabalavantudanainan - Aa - Aa
Viluvagu Nee Premalenicho Mrogedi Kanchutaalamu Nagudun
|| O ||
3)
Prema Matsarapadadu - Tvaragaanu Kopapadadu - Amaryaadaganu
Naduvadu - Durneetilo Santoshapadadu - Aa - Aa
Prema Niratamundunu Deerghakaalamu Sahinchunu
|| O ||
4)
Choochedi Naruni Preminpaka - Choodani Ninnu Preminpalemu
Choodani Ninnu Preminchina - Choochedi Naruni Preminpavalen
Aa - Aa - Chittamuna Nee Premunte - Chirakaalamu
Jeevintumu Devaa
|| O ||
5)
Nee Yaagnaala Gaikoni Nadachute - Paripoorna Prema Maa Prabhuvaa
Nee Yadbhuta Prema Okkate - Okarinokaramu Preminchute
Aa - Aa - O Premaasvaroopi Maa Yesu - Nee Premanu
Chaatedamu Bhuvilo
|| O ||
Present