తెలుగు అద్భుత దీవెనలు ప్రభువా
పల్లవిఅద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి
నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై జూపితివి
1)మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు
నీ కిష్టులముగా బ్రతికి దీవెనలెన్నో పొందెదము
|| అద్భు ||
2)నూతన జన్మవలన ఆశీర్వాదములు దొరికె
శాపమును దూరపరచి సర్వంబు క్రొత్తజేసే
|| అద్భు ||
3)లోకమునుండి వేరై సిలువను మోయవలెను
అప్పుడే ప్రభు దీవించు స్వాస్థ్యమును గాంతుమెంతో
|| అద్భు ||
4)తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలిచి
జీవజలమును పొంది దీవెనలెన్నో పొందెదము
|| అద్భు ||
5)ఆత్మీయముగ నడచి శరీర క్రియలను విడచి
ఆయన స్వరము వినుచు దీవెనలెన్నో పొందెదము
|| అద్భు ||
6)ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్న మనము
ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనలెన్నో పొందెదము
|| అద్భు ||
English Adbhuta Deevenalu Prabhuvaa
ChorusAdbhuta Deevenalu Prabhuvaa Kummarinchitivi
Needu Prema Apaaramu Prabhuvaa Maapai Joopitivi
1)Maanavuni Chesinaavu Nee Svanta Roopamunaku
Nee Kishtulamugaa Bratiki Deevenalenno Pondedamu
|| Adbhu ||
2)Nootana Janmavalana Aaseervaadamulu Dorike
Saapamunu Dooraparachi Sarvanbu Krottajese
|| Adbhu ||
3)Lokamunundi Verai Siluvanu Moyavalenu
Appude Prabhu Deevinchu Svaasthyamunu Gaantumento
|| Adbhu ||
4)Tana Sutulugaanu Meligi Tana Chittamandu Nilichi
Jeevajalamunu Pondi Deevenalenno Pondedamu
|| Adbhu ||
5)Aatmeeyamuga Nadachi Sareera Kriyalanu Vidachi
Aayana Svaramu Vinuchu Deevenalenno Pondedamu
|| Adbhu ||
6)Aaseervaadamula Koraku Piluvabadiyunna Manamu
Aagnaalanu Neraverchinacho Deevenalenno Pondedamu
|| Adbhu ||