Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 28 Old No: 39

హల్లెలూయా స్తుతి స్తోత్రములతో

Hallelooya Sthuthi Stotramulato

Open in Word & Worship App
తెలుగు   హల్లెలూయా స్తుతి స్తోత్రములతో
పల్లవి
హల్లెలూయ స్తుతి స్తోత్రములతో ప్రభుని స్తుతించెదము
రక్షణ నిచ్చిన అక్షయుడగు - ప్రభున్‌ ప్రణుతించెదము
1)
పాపులను ప్రేమించి ప్రభువు - ప్రాణము బలిజేసెన్‌
పాపశాపము మోసి మనకు - రక్షణ నిచ్చెను
పాపపు ముల్లు విరిచి జయము - నిచ్చిన ప్రభువునకు
|| హల్లె ||
2)
లోక పాపములు తీసివేసెడు - దేవుని గొఱ్ఱెపిల్ల
శాపగ్రాహియై సిలువలో మనకై - వ్రేలాడెను ప్రభువు
పాపశాపములు భరించి - తానే మరల లేచెనని
|| హల్లె ||
3)
మారా జీవిత శోధనలలో - మనతో నుండెను
వేదన బాధలో ప్రేమతో కాచి - జీవము నిచ్చెను
శత్రునిపై విజయమునిచ్చి - కృపతో నడుపునని
|| హల్లె ||
4)
ఇరుకులలో విశాలతనిచ్చి - వింతగమము నడిపెను
కనుపాపవలె మనలను కాచి - తనచెంతను నిలిపెను
ఉన్నతమగు శిఖరముపై నిలిపి నడిపించునని
|| హల్లె ||
5)
అందరిలో అధికుడగు ప్రభుని ఆరాధించెదము
అన్నిటిలో విజయమ్ము నిచ్చెడు - యేసును స్తుతించెదము
కృతజ్ఞత స్తుతి స్తోత్రములతో ప్రభు సన్నిధి చేరుచు
|| హల్లె ||
English   Hallelooya Sthuthi Stotramulato
Chorus
Hallelooya Sthuthi Stotramulato Prabhuni Sthuthinchedamu
Rakshana Nichchina Akshayudagu - Prabhun Pranutinchedamu
1)
Paapulanu Preminchi Prabhuvu - Praanamu Balijesen
Paapasaapamu Mosi Manaku - Rakshana Nichchenu
Paapapu Mullu Virichi Jayamu - Nichchina Prabhuvunaku
|| Halle ||
2)
Loka Paapamulu Teesivesedu - Devuni Gorrepilla
Saapagraahiyai Siluvalo Manakai - Vrelaadenu Prabhuvu
Paapasaapamulu Bharinchi - Taane Marala Lechenani
|| Halle ||
3)
Maaraa Jeevita Sodhanalalo - Manato Nundenu
Vedana Baadhalo Premato Kaachi - Jeevamu Nichchenu
Satrunipai Vijayamunichchi - Krupato Nadupunani
|| Halle ||
4)
Irukulalo Visaalatanichchi - Vintagamamu Nadipenu
Kanupaapavale Manalanu Kaachi - Tanachentanu Nilipenu
Unnatamagu Sikharamupai Nilipi Nadipinchunani
|| Halle ||
5)
Andarilo Adhikudagu Prabhuni Aaraadhinchedamu
Annitilo Vijayammu Nichchedu - Yesunu Sthuthinchedamu
Krutagnaata Sthuthi Stotramulato Prabhu Sannidhi Cheruchu
|| Halle ||
Present