తెలుగు యేసుని ప్రేమను నేమారకుమా
పల్లవియేసుని ప్రేమను - యేమారకను యెప్పుడు దలచవె
యో మనసా - వాసిగ నాతని - వరనామంబును -
వదలక పాగడవె - యో మనసా
1)పాపుల కొరకై ప్రాణము బెట్టిన - ప్రభు నిల దలచవె
యో మనసా - శాపము నంతయు - జక్కగ నోర్చిన
శాంతుని పొగడవె యో మనసా
|| యేసుని ||
2)కష్టములలో మన కండగ నుండిన - కర్తను దలచవె
యో మనసా - నష్టము లన్నియు - నణచిన యాగురు
శ్రేష్ఠుని పొగడవె యో మనసా
|| యేసుని ||
3)మరణతఱిని మన శరణుగ నుండెడు - మాన్యుని దలచవె
యో మనసా - కరుణను మన కన్నీటిని దుడిచిన
కర్తను పొగడవె యో మనసా
|| యేసుని ||
4)ప్రార్థనలు విని ఫలముల నొసగిన - ప్రభునిల దలచవె
యో మనసా - వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన
వంద్యుని పొగడవె యో మనసా
|| యేసుని ||
5)వంచన లేక వరముల నొసగిన - వరదుని దలచవె
యో మనసా - కొంచెము కాని - కూర్మితో దేవుని
కొమరుని పొగడవె యో మనసా
|| యేసుని ||
English Yesuni Premanu Nemarakumaa
ChorusYesuni Premanu - Yemaarakanu Yeppudu Dalachave
Yo Manasaa - Vaasiga Naatani - Varanaamanbunu -
Vadalaka Paagadave - Yo Manasaa
1)Paapula Korakai Praanamu Bettina - Prabhu Nila Dalachave
Yo Manasaa - Saapamu Nantayu - Jakkaga Norchina
Saantuni Pogadave Yo Manasaa
|| Yesuni ||
2)Kashtamulalo Mana Kandaga Nundina - Kartanu Dalachave
Yo Manasaa - Nashtamu Lanniyu - Nanachina Yaaguru
Sreshthuni Pogadave Yo Manasaa
|| Yesuni ||
3)Maranatarini Mana Saranuga Nundedu - Maanyuni Dalachave
Yo Manasaa - Karunanu Mana Kanneetini Dudichina
Kartanu Pogadave Yo Manasaa
|| Yesuni ||
4)Praarthanalu Vini Phalamula Nosagina - Prabhunila Dalachave
Yo Manasaa - Vardhana Goruchu Sradhato Diddina
Vandyuni Pogadave Yo Manasaa
|| Yesuni ||
5)Vanchana Leka Varamula Nosagina - Varaduni Dalachave
Yo Manasaa - Konchemu Kaani - Koormito Devuni
Komaruni Pogadave Yo Manasaa
|| Yesuni ||