తెలుగు ఈలాటిడా యేసుప్రేమ
పల్లవిఈలాటిదా యేసు ప్రేమ! - నన్ను తూలనాడక తనదు జాలిజూపినదా!
1)ఎనలేని పాపకూపమున - నేను తనికి - మినుకుచును నే
దరిగాన కుండన్ - కనికరము బెంచి నాయందు -
వేగగొనిపోవ నా మేలు కొరకిందు వచ్చెన్
|| ఈలా ||
2)పెనుగొన్న దుఃఖాబ్దిలోన - నేను మునిగి కుములుచునేడు
పునుగుందునపుడు నను నీచుడని త్రోయలేక -
తనదు నెనరు నాకగుపరచి నీతి జూపించెన్
|| ఈలా ||
3)నెమ్మి ర్వంతైన లేక - చింత గ్రమ్మిపొగలుచునుండగా నన్ను జూచి -
సమ్మతిని నను బ్రోవదలచి - కరము జాచి నా చెయు బట్టి
చక్కగా నిలిపెన్
|| ఈలా ||
4)పనికిమాలినవాడనైన - నేను - కనుపరచు నాదోష కపటవర్తనము
మనసు నుంచక తాపపడక - ఇంతఘనమైన రక్షణనిల
నాకు జూపెన్
|| ఈలా ||
5)నా కోర్కెలెల్ల సమయములన్ - క్రింది లోకవాంఛల
భ్రమసిలొంగెడు వేళన్ - చేకూర్చి దృఢము చిత్తమునన్
శుభము నా కొసగె జీవింప నా రక్షకుండు
|| ఈలా ||
6)శోధనలు నను జుట్టినపుడు - నీతి బోధ నా మనసులో -
బుట్టించి పెంచి - బాధలెల్లను బాపిమాపి యిట్టి యాదరణ జూపెనా!
యహాహా! యేమందు
|| ఈలా ||
English Eelaatidaa Yesuprema
ChorusEelaatidaa Yesu Prema! - Nannu Toolanaadaka Tanadu Jaalijoopinadaa!
1)Enaleni Paapakoopamuna - Nenu Taniki - Minukuchunu Ne
Darigaana Kundan - Kanikaramu Benchi Naayandu -
Vegagonipova Naa Melu Korakindu Vachchen
|| Eelaa ||
2)Penugonna DuHkhaabdilona - Nenu Munigi Kumuluchunedu
Punugundunapudu Nanu Neechudani Troyaleka -
Tanadu Nenaru Naakaguparachi Neeti Joopinchen
|| Eelaa ||
3)Nemmi Rvantaina Leka - Chinta Grammipogaluchunundagaa Nannu Joochi -
Sammatini Nanu Brovadalachi - Karamu Jaachi Naa Cheyu Batti
Chakkagaa Nilipen
|| Eelaa ||
4)Panikimaalinavaadanaina - Nenu - Kanuparachu Naadosha Kapatavartanamu
Manasu Nunchaka Taapapadaka - Intaghanamaina Rakshananila
Naaku Joopen
|| Eelaa ||
5)Naa Korkelella Samayamulan - Krindi Lokavaanchala
Bhramasilongedu Velan - Chekoorchi Drudhamu Chittamunan
Subhamu Naa Kosage Jeevinpa Naa Rakshakundu
|| Eelaa ||
6)Sodhanalu Nanu Juttinapudu - Neeti Bodha Naa Manasulo -
Buttinchi Penchi - Baadhalellanu Baapimaapi Yitti Yaadarana Joopenaa!
Yahaahaa! Yemandu
|| Eelaa ||