తెలుగు ఈ రాత్రి కాపుదలకై
పల్లవిఈరాత్రి కాపుదలకై లోకరక్షకా నీకు మ్రొక్కెదము - నీ దివ్యమైన
రెక్కల చాటునుంచి కాచి బ్రోచుటకై మా దేవా - కాచి బ్రోచుటకై
1)పగటివేళ నీ కృప మేఘములు పంపితివి మా కొఱకు
ఈ రాత్రి ఆపదలన్ బాపన్ నీ అగ్ని స్థంభముంచు ప్రభో
నీయగ్ని ప్రాకారముంచు ప్రభో
|| ఈ ||
2)అలసిపోయిన మాదు దేహము హాయి నొందుటకు నీ కృపలో
ఆహార వస్త్రములతో మాకు ఈ గృహవసతి నొసగితివే మా దేవా
వందనములివిగో
|| ఈ ||
3)పాప చీకటి బాపుటకు నీ ప్రాణమిచ్చితివి - మా దేవా
నిత్యంపు వెల్గు జీవనజ్యోతి నీ-వే-నిత్య జనకుడవు నీవే
మానీతి సూర్యుడవు
|| ఈ ||
4)భూమి యాకాశంబులన్నియు మారిపోవునికన్ త్వరలో పాపాంధకార
యుగముల్ పారిపోవున్ నీతి యుగమేలున్ శ్రీయేసే రాజులకు రాజై
|| ఈ ||
5)ఈ దినమే నా యంతమేమో నన్ను కరుణించు -
నిర్దోషిగా నీదు సన్నిధి నిల్వగోరుచు నిన్నే ప్రార్థింతున్ -
నా దేవా నిన్నే స్తుతియింతున్
|| ఈ ||
English Ee Raatri Kaapudalakai
ChorusEeraatri Kaapudalakai Lokarakshakaa Neeku Mrokkedamu - Nee Divyamaina
Rekkala Chaatununchi Kaachi Brochutakai Maa Devaa - Kaachi Brochutakai
1)Pagativela Nee Krupa Meghamulu Panpitivi Maa Koraku
Ee Raatri Aapadalan Baapan Nee Agni Sthanbhamunchu Prabho
Neeyagni Praakaaramunchu Prabho
|| Ee ||
2)Alasipoyina Maadu Dehamu Haayi Nondutaku Nee Krupalo
Aahaara Vastramulato Maaku Ee Gruhavasati Nosagitive Maa Devaa
Vandanamulivigo
|| Ee ||
3)Paapa Cheekati Baaputaku Nee Praanamichchitivi - Maa Devaa
Nityanpu Velgu Jeevanajyoti Nee-Ve-Nitya Janakudavu Neeve
Maaneeti Sooryudavu
|| Ee ||
4)Bhoomi Yaakaasanbulanniyu Maaripovunikan Tvaralo Paapaandhakaara
Yugamul Paaripovun Neeti Yugamelun Sreeyese Raajulaku Raajai
|| Ee ||
5)Ee Diname Naa Yantamemo Nannu Karuninchu -
Nirdoshigaa Needu Sannidhi Nilvagoruchu Ninne Praarthintun -
Naa Devaa Ninne Sthuthiyintun
|| Ee ||