తెలుగు ఆకాశంబు భూమియు
1)ఆకాశంబు భూమియు - అంతట చీకటి యాయెను
ప్రాకెడు చీకటి సమయమున - ప్రార్థన చేతుము మా దేవా
2)చక్కని చుక్కలు మింటను - చక్కగ మమ్మును జూడగ
ప్రక్కకు రావె వేగముగా - ప్రభువా గావుము నీ నీడన్
3)చిన్నచిన్న పక్షులు - చిన్న చిన్న పూవులు
ఎన్నో ఎన్నో జీవులు - నిన్నే గొలిచి నిద్రించున్
4)చిన్ని చిన్ని పాపలు - చిన్ని చిన్ని పడకలలో
చిన్ని కనులు మూయంగా - చెన్నుగ యేసూ గావుమా
5)నేలను బోయెడి బండ్లలో - నీటను బోయెడి ఓడలలో
గాలి విమానంబులలోన - కావుము దేవ ప్రయాణికులన్
6)రాత్రిలో నీదు దూతలు - రమ్యంబైన రెక్కలతో
చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ - నిద్రించెదము మా దేవా
7)తెల్లవారుజామున - తెలివొంది మే మందరము
మెల్లగ లేచి నుతియింపన్ - మేల్కొల్పుము నా ప్రియతండ్రి
8)జనక తనయా శుద్ధాత్మా - జయము మహిమ స్తోత్రములు
అనిశము నీకే చెల్లునుగా - అనిశము చెల్లును నీ కామెన్
English Aakaashambu Bhoomiyau
1)Aakaasanbu Bhoomiyu - Antata Cheekati Yaayenu
Praakedu Cheekati Samayamuna - Praarthana Chetumu Maa Devaa
2)Chakkani Chukkalu Mintanu - Chakkaga Mammunu Joodaga
Prakkaku Raave Vegamugaa - Prabhuvaa Gaavumu Nee Needan
3)Chinnachinna Pakshulu - Chinna Chinna Poovulu
Enno Enno Jeevulu - Ninne Golichi Nidrinchun
4)Chinni Chinni Paapalu - Chinni Chinni Padakalalo
Chinni Kanulu Mooyangaa - Chennuga Yesoo Gaavumaa
5)Nelanu Boyedi Bandlalo - Neetanu Boyedi Odalalo
Gaali Vimaananbulalona - Kaavumu Deva Prayanikula
6)Raatrilo Needu Dootalu - Ramyanbaina Rekkalato
Chitranmbuga Mammunu Gramman - Nidrinche Velanu Kaavumaa
7)Tellavaarujaamu - Telivinchi Memandaramu
Mellaga Lechi Nutiyinpan - Melkolupu Naa Devaa
8)Janaka Tanayaa Suddhaatmaa - Jayamu Mahima Stotrambulu
Anisamu Neeke Chellunugaa - Anisamu Chellunugaa