Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 272 Old No: 415

రాత్రియయ్యే నన్నెడ

Raatriyayye Nanneda

Open in Word & Worship App
తెలుగు   రాత్రియయ్యే నన్నెడ
పల్లవి
రాత్రియయ్యె నన్నెడఁబాయకు - ధాత్రిపై జీకటుఁ గ్రమ్మెను
సహాయ మేమి లేనివారికి - సహాయుడా, నన్బాసిపోకుమీ
1)
ఏకాలంబైన నీ సహాయము - లేక పిశాచిన్‌ గెల్వఁజాలను
నీకంటె దిక్కు నాకు లేదుగా లోక ప్రకాశుఁడా నన్బాయకు
2)
నాచెంత నీవు చేరియుండఁగ - ఏ చింతయైన నన్ను సోకునా
ఏ శత్రువైన నన్ను గెల్చునా? - నా శైలమా, నన్బాసి పోకుమా
3)
సమృద్ధుడు సహాయుఁడాయెను - ఓ మృత్యువా నీముల్లు
గెల్చునా? సమాధి నీకు జయమబ్బునా? - మామధ్యమున్‌
సర్వేశ పాయకు
4)
రేవు నేఁజేరబోవు వేళలోన్‌ - కావుమయ్యా నీ దీప్తిఁజూపుచున్‌
చావు జీవంబులందు నైనను - నీవుతోడై నన్బాసిపోకుము
English   Raatriyayye Nanneda
Chorus
Raatriyayye Nannedanbaayaku - Dhaatripai Jeekatun Grammenu
Sahaaya Memi Lenivaariki - Sahaayudaa, Nanbaasipokumee
1)
ekaalanbaina Nee Sahaayamu - Leka Pisaachin Gelvanjaalanu
Neekante Dikku Naaku Ledugaa Loka Prakaasundaa Nanbaayaku
2)
Naachenta Neevu Cheriyundanga - e Chintayaina Nannu Sokunaa
e Satruvaina Nannu Gelchunaa? - Naa Sailamaa, Nanbaasi Pokumaa
3)
Samrddhudu Sahaayundaayenu - O Mrtyuvaa Neemullu
Gelchunaa? Samaadhi Neeku Jayamabbunaa? - Maamadhyamun
Sarvesa Paayaku
4)
Revu Nenjerabovu Velalon - Kaavumayyaa Nee Deeptinjoopuchun
Chaavu Jeevanbulandu Nainanu - Neevutodai Nanbaasipokumu
Present