తెలుగు ఈ సాయంకాలమున
పల్లవిఈ సాయంకాలమున - యేసు ప్రభో వేఁడెదము - నీ
సుదయా రస మొల్క - నిత్యంబు మముఁగావు
1)చెడ్డకలల్ రాకుండ - నడ్డగించుమి ప్రభో
బిడ్డలము రాత్రిలో భీతిఁబాపుము తండ్రి
|| ఈ ||
2)దుష్టుండౌ శోధకుని - ద్రొక్కుటకు బలమిమ్ము
భ్రష్టత్వమున మేము - పడకుండఁగాపాడు
|| ఈ ||
3)నీ యేక పుత్రుండౌ - శ్రీయేసు నామమున
సాయంప్రార్థన లెల్ల సరిగ నాలించుమయా
|| ఈ ||
4)జనక సుత శుద్ధాత్మ - ఘనదేవా స్తుతియింతుం
అనిశము జీవించి రా - జ్యంబుఁజేయు మామేన్
|| ఈ ||
English Ee Saayankalamuna
ChorusEe Saayankaalamuna - Yesu Prabho Vendedamu - Nee
Sudayaa Rasa Molka - Nityanbu Mamungaavu
1)Cheddakalal Raakunda - Naddaginchumi Prabho
Biddalamu Raatrilo Bheetinbaapumu Tandri
|| Ee ||
2)Dushtundau Sodhakuni - Drokkutaku Balamimmu
Bhrashtatvamuna Memu - Padakundangaapaadu
|| Ee ||
3)Nee Yeka Putrundau - Sreeyesu Naamamuna
Saayanpraarthana Lella Sariga Naalinchumayaa
|| Ee ||
4)Janaka Suta Sudhaatma - Ghanadevaa Sthuthiyintum
Anisamu Jeevinchi Raa - Jyanbunjeyu Maamen
|| Ee ||