Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 27 Old No: 38

సర్వ కృపానిధి యగు ప్రభువా

Sarva Krpaanidhi Yagu Prabhuvaa

♪ సీయోను గీతములు♪ Songs of Zion
Open in Word & Worship App
తెలుగు   సర్వ కృపానిధి యగు ప్రభువా
పల్లవి
సర్వకృపానిధియగు ప్రభువా - సకలచరాచర సంతోషమా
స్తోత్రముచేసి స్తుతించెదము - సంతసముగా నిను పొగడెదము

హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
యని పాడెదను ఆనందముతో సాగెదను
1)
ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నన్ను రక్షించితివి
పరిశుద్ధముగ జీవించుటకై - పాపిని నను కరుణించితివి
|| హ ||
2)
అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి
నాథుని అడుగుజాడలలో - నడుచుటకు నన్ను పిలచితివి
|| హ ||
3)
మరణ శరీరము మార్పునొంది - మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నన్ను నింపితివి - మరణ భయములను తీర్చితివి
|| హ ||
4)
భువి నుండి శ్రేష్ఠఫలముగను - దేవునికి నిత్యస్వాస్థ్యముగా
భూజనములలో నుండినను - ప్రేమించి క్రయధనమిచ్చితివి
|| హ ||
5)
ఎవరు పాడని గీతమును - యేసుని గూర్చి పాడుటకై
హేతువులేకయే ప్రేమించెను - యేసుకు నేనేమివ్వగలను
|| హ ||
English   Sarva Krpaanidhi Yagu Prabhuvaa
Chorus
Sarvakrupaanidhiyagu Prabhuvaa - Sakalacharaachara Santoshamaa
Stotramuchesi Sthuthinchedamu - Santasamugaa Ninu Pogadedamu
1)
Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa
Yani Paadedanu Aanandamuto Saagedanu
2)
Preminchi Nannu Vedakitivi - Preetito Nannu Rakshinchitivi
Parisudhamuga Jeevinchutakai - Paapini Nanu Karuninchitivi
|| Ha ||
3)
Alpakaala Sramalanubhavinpa - Anudinamu Krupanichchitivi
Naathuni Adugujaadalalo - Naduchutaku Nannu Pilachitivi
|| Ha ||
4)
Marana Sareeramu Maarpunondi - Mahima Sareeramu Pondutakai
Mahimaatmato Nannu Ninpitivi - Marana Bhayamulanu Teerchitivi
|| Ha ||
5)
Bhuvi Nundi Sreshthaphalamuganu - Devuniki Nityasvaasthyamugaa
Bhoojanamulalo Nundinanu - Preminchi Krayadhanamichchitivi
|| Ha ||
6)
Evaru Paadani Geetamunu - Yesuni Goorchi Paadutakai
Hetuvulekaye Preminchenu - Yesuku Nenemivvagalanu
|| Ha ||
Present