తెలుగు పూజింతును నిను దేవ
పల్లవిపూజింతును నిను దేవా యోహోవా - పూజార్హుఁడా మహాదేవా
ఉదయ కాలముననే - నీ పద సన్నిధిలో
1)భానుండుదయించకముందే - దివివెలుగు భువి చేరకముందే
నిర్మల హృదితో నిను కొనియాడి - ఆరాధింతును
అవనిలో ప్రభువా
|| పూజి ||
2)వేల్పులలో నీసముడెవరు - సృష్టికి నిర్మాణకుడవు నీవే
మహాత్యము మహిమయుగల దేవా - నిను పూజించి
ఘనపరచెదను
|| పూజి ||
3)పాపికి రక్షణ నొసగిన దేవా - మృతులకు జీవము నిచ్చిన ప్రభువా
జీవాధిపతి చిరజీవదాత - స్తుతియించెద నిను నా మనసార
|| పూజి ||
4)ఈ పూజకు పూవులు లేవు - వెలిగించుటకు దీపములేదు
అర్పించుట కర్పణలు లేవు - విరిగిన మనసే బలిఅర్పించెద
|| పూజి ||
5)నీ ప్రియ సుతుని నామమున - అందుకో దేవా ఈ స్తుతులు
ఇవియేగా నాకున్నవి ప్రభువా - నీవెపుడు నను కోరినవి
|| పూజి ||
6)ఏ రొగమును నెపుడేని - మా మందిరపు - ద్వారంబు చోరనీయక
ఆరోగ్యభాగధే - యంబిచ్చి - మమ్ములను - భూరికృపాభ్ధివై
పోషింపుమను దినము
|| పూజి ||
7)ఇరుగుపొరుగు వారలతో - సమాధాన - పరతవసింపను నేర్పి
కొఱగాని కలహములు - త్వరపెట్ట నవ్వాని - భరియింపఁదగు
సహన భావంబు మాకిమ్ము
|| పూజి ||
8)బీదసాదల కెల్లరకు - మా గృహమెప్పు - డాదరణాస్పదమై
యుండ నీ దానాసారంబు - నెఱవర్షించిన కొలఁది
నౌదర్యగుణము మా యందుఁ బెంచుము సొరిది
|| పూజి ||
9)నక్కలకు బొరియలుండు - దివిపక్షులకుఁ జక్కుని గూళ్లునమరు
నొక్కింత యిక్కనా - కెక్కడలేదని - చక్కని నరసుతమా
సదనంబునకు రమ్ము
|| పూజి ||
English Poojintunu Ninu Deva
ChorusPoojintunu Ninu Devaa Yohovaa - Poojaarhundaa Mahaadevaa
Udaya Kaalamunane - Nee Pada Sannidhilo
1)Bhaanundudayinchakamunde - Divivelugu Bhuvi Cherakamunde
Nirmala Hrudito Ninu Koniyaadi - Aaraadhintunu
Avanilo Prabhuvaa
|| Pooji ||
2)Velpulalo Neesamudevaru - Srushtiki Nirmaanakudavu Neeve
Mahaatyamu Mahimayugala Devaa - Ninu Poojinchi
Ghanaparachedanu
|| Pooji ||
4)Paapiki Rakshana Nosagina Devaa - Mrtulaku Jeevamu Nichchina Prabhuvaa
Jeevaadhipati Chirajeevadaata - Sthuthiyincheda Ninu Naa Manasaara
|| Pooji ||
4)Ee Poojaku Poovulu Levu - Veliginchutaku Deepamuledu
Arpinchuta Karpanalu Levu - Virigina Manase Baliarpincheda
|| Pooji ||
5)Nee Priya Sutuni Naamamuna - Anduko Devaa Ee Stutulu
Iviyegaa Naakunnavi Prabhuvaa - Neevepudu Nanu Korinavi
|| Pooji ||
6)e Rogamunu Nepudeni - Maa Mandirapu - Dvaaranbu Choraneeyaka
Aarogyabhaagadhe - Yanbichchi - Mammulanu - Bhoorikrupaabhdhivai
Poshinpumanu Dinamu
|| Pooji ||
7)Iruguporugu Vaaralato - Samaadhaana - Paratavasinpanu Nerpi
Koragaani Kalahamulu - Tvarapetta Navvaani - Bhariyinpandagu
Sahana Bhaavanbu Maakimmu
|| Pooji ||
8)Beedasaadala Kellaraku - Maa Gruhameppu - Daadaranaaspadamai
Yunda Nee Daanaasaaranbu - Neravarshinchina Kolandi
Naudaryagunamu Maa Yandun Benchumu Soridi
|| Pooji ||
9)Nakkalaku Boriyalundu - Divipakshulakun Jakkuni Goollunamaru
Nokkinta Yikkanaa - Kekkadaledani - Chakkani Narasutamaa
Sadananbunaku Rammu
|| Pooji ||