తెలుగు నుతిసేయను లేవే
పల్లవినుతి సేయను లేవే - ఓ మనసా - నుతిఁజేయను లేవే - క్షితిని
దివిని - హితమతిఁబ్రోచెడి - సుతుని జనకుని శుద్దాత్మునిఁ ద్రేక్యుని
1)సూర్యుని కాంతి - సొంపగు పంటలు
సుకాలక్షేమముల్ - శోభిల్లు గేహమున్
ఆర్యసాంగాత్యము - నైశ్వర్యముల నిల
ననుభవింపవె నీవే - యాఢ్యునిపేర్మిని
|| స్తుతి ||
2)దురితములందె - దుర్గతి నన్ను నీ
కురుతర ప్రేమను - బరమార్ధమీయను
వరపుత్రు నొసఁగఁడె - వందనీయుఁడు ప్రభు
మరిమరి మ్రొక్కు మా - పరమోపకారిని
|| స్తుతి ||
3)జీవము జ్ఞానము - జీవము నొసంగెడు
పావనాత్మను నీకై - పంపినదేవుఁడు
కేవల దోష స్వ-భావము మార్చఁడె
సేవ జేయుమ నీవా పావనమూర్తికి
|| స్తుతి ||
4)కరములు పదముల్ - కనకాదు లన్నియు
స్వరమును చిత్తము - స్థిరమగు ప్రేమయు
మరినీదు హృదయము - పరమాత్ము సేవకై
పరిపూర్ణముగ నిచ్చి - ప్రణుతించు మాయనన్
|| స్తుతి ||
English Nutiseeyanu Leve
ChorusNuti Seyanu Leve - O Manasaa - Nutinjeyanu Leve - Kshitini
Divini - Hitamatinbrochedi - Sutuni Janakuni Suddaatmunin Drekyuni
1)Sooryuni Kaanti - Sonpagu Pantalu
Sukaalakshemamul - Sobhillu Gehamun
Aaryasaangaatyamu - Naisvaryamula Nila
Nanubhavinpave Neeve - Yaadhyunipermini
|| Sthuthi ||
2)Duritamulande - Durgati Nannu Nee
Kurutara Premanu - Baramaardhameeyanu
Varaputru Nosangande - Vandaneeyundu Prabhu
Marimari Mrokku Maa - Paramopakaarini
|| Sthuthi ||
3)Jeevamu Gnaanamu - Jeevamu Nosangedu
Paavanaatmanu Neekai - Panpinadevundu
Kevala Dosha Sva-Bhaavamu Maarchande
Seva Jeyuma Neevaa Paavanamoortiki
|| Sthuthi ||
4)Karamulu Padamul - Kanakaadu Lanniyu
Svaramunu Chittamu - Sthiramagu Premayu
Marineedu Hrudayamu - Paramaatmu Sevakai
Paripoornamuga Nichchi - Pranutinchu Maayanan
|| Sthuthi ||