తెలుగు మేలుకొనరే మీమనంబు
పల్లవిమేలుకొనరే మీ మనంబుల - మేలిమిగ - మీ మేరఁదప్పక
పాలుమాలక లేచి దేవుని పాదములు పూజింప గ్రక్కున
1)దిక్కులెల్లను తేజరిల్లెను - దినకరుండుదయింప నయ్యెను
మ్రొక్కులకు ప్రతిఫలమునిచ్చెడు - మూలకర్తకు గొలువుసేయఁగ
|| మేలు ||
2)పక్షులెల్లను గిలకిలంచును - ప్రభుని మహిమలు - బల్కదొడఁగెను
రక్షకుని సకలోపకృతులను - రమ్యముగ నుతియించి పాడఁగ
|| మేలు ||
3)నిదురబోయిన వేళ - మిమ్మొక నిమిషమైనను - బాసియుండక
పదిలముగ రక్షించు దేవుని - ప్రస్తుతింప మహాముదంబున
|| మేలు ||
4)మేటియౌ హృదయాబ్జములలో -మీ కృతజ్ఞతా భూషణంబులు
నేటుగా ధరియించుకొని యిటు - నిర్మలాత్మునిఁబూజసేయఁగ
|| మేలు ||
5)తెల్లవారఁగఁ తెలియరే ఇది - తెలివిగల మానవ సమాజము
యుల్లసిల్లుచు నీతిభాస్కరు-డుదయమయ్యెను - హృదయములపై
|| మేలు ||
English Melukonare Meemanambu
ChorusMelukonare Mee Mananbula - Melimiga - Mee Merandappaka
Paalumaalaka Lechi Devuni Paadamulu Poojinpa Grakkuna
1)Dikkulellanu Tejarillenu - Dinakarundudayinpa Nayyenu
Mrokkulaku Pratiphalamunichchedu - Moolakartaku Goluvuseyanga
|| Melu ||
2)Pakshulellanu Gilakilanchunu - Prabhuni Mahimalu - Balkadodangenu
Rakshakuni Sakalopakrutulanu - Ramyamuga Nutiyinchi Paadanga
|| Melu ||
3)Niduraboyina Vela - Mimmoka Nimishamainanu - Baasiyundaka
Padilamuga Rakshinchu Devuni - Prasthuthinpa Mahaamudanbuna
|| Melu ||
4)Metiyau Hrudayaabjamulalo -Mee Krutagnaataa Bhooshananbulu
Netugaa Dhariyinchukoni Yitu - Nirmalaatmuninboojaseyanga
|| Melu ||
5)Tellavaarangan Teliyare Idi - Telivigala Maanava Samaajamu
Yullasilluchu Neetibhaaskaru-Dudayamayyenu - Hrudayamulapai
|| Melu ||