Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 265 Old No: 409

మరువను దేవా మా యేసు

Maruvanu Devaa Maa Yesu

Open in Word & Worship App
తెలుగు   మరువను దేవా మా యేసు
పల్లవి
మరువను దేవా మా యేసుప్రభువా - వేకువనే నిన్‌ వెదకెద
దేవా మహోన్నతుడా! మారనిదేవా - ఎన్నటికి నన్‌ విడువనంటివే
1)
ముదమున నాదు హృదయ ధ్యానముల్‌ - ఉదయకాలమే
కాచియుంచెదన్‌ - నీళ్ళులేకయే ఎండిన భూమి
చందమున నీ సన్నిధినుంటిని
|| మరు ||
2)
అంచితముగ నా మంచము మీదనే - నిన్ను జ్ఞాపకం చేసి
కొందును - క్రొవ్వు మెదడులే దొరికినట్లుగా - ఉల్లసించెదన్‌
స్తుతియించెదను
|| మరు ||
3)
ఎన్నికలేని మన్నుకు నీదు - ఉన్నతరూపం నిచ్చిన దేవా
నీ జీవాత్మను నాలో ఊది - శాశ్విత ప్రేమను చూపిన దేవా
|| మరు ||
4)
జీవముకంటె నీ కృపోత్తమం చావునుండి నన్‌ లేపితివయ్యా
పరిశుద్ధులలో యాజక గుంపులో - రాజులవలెనన్‌ రక్షించితివే
|| మరు ||
5)
అగణిత పాపిని అగ్నిపాత్రుని - ఆమరణాంతం కరుణించితివే
నిత్యజీవము నిండు నెమ్మది - ఇచ్చిన దేవా నీకే స్తోత్రం
|| మరు ||
6)
హింసలు బాధలు కరువు ఖడ్గముల్‌ - నీ కృపనుండి నన్‌
యెడబాపవని నమ్మితినయ్యా - నెమ్మదినియ్యుము
ఈ పగలంతా జీవితమంతా
|| మరు ||
English   Maruvanu Devaa Maa Yesu
Chorus
Maruvanu Devaa Maa Yesuprabhuvaa - Vekuvane Nin Vedakeda
Devaa Mahonnatudaa! Maaranidevaa - Ennatiki Nan Viduvanantive
1)
Mudamuna Naadu Hrudaya Dhyaanamul - Udayakaalame
Kaachiyunchedan - Neellulekaye Endina Bhoomi
Chandamuna Nee Sannidhinuntini
|| Maru ||
2)
Anchitamuga Naa Manchamu Meedane - Ninnu Gnaapakan Chesi
Kondunu - Krovvu Medadule Dorikinatlugaa - Ullasinchedan
Sthuthiyinchedanu
|| Maru ||
3)
Ennikaleni Mannuku Needu - Unnataroopan Nichchina Devaa
Nee Jeevaatmanu Naalo Oodi - Saasvita Premanu Choopina Devaa
|| Maru ||
4)
Jeevamukante Nee Krupottaman Chaavunundi Nan Lepitivayyaa
Parisuddhulalo Yaajaka Gunpulo - Raajulavalenan Rakshinchitive
|| Maru ||
5)
Aganita Paapini Agnipaatruni - Aamaranaantan Karuninchitive
Nityajeevamu Nindu Nemmadi - Ichchina Devaa Neeke Stotran
|| Maru ||
6)
Hinsalu Baadhalu Karuvu Khadgamul - Nee Krupanundi Nan
Yedabaapavani Nammitinayyaa - Nemmadiniyyumu
Ee Pagalantaa Jeevitamantaa
|| Maru ||
Present