Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 260 Old No: 696

మహాత్యము గల దేవా

Mahatyamu Gala Devaa

Open in Word & Worship App
తెలుగు   మహాత్యము గల దేవా
పల్లవి
మహాత్మ్యము గల దేవా - మహోన్నతుడా యెహోవా
నీ భీకర కార్య విక్రమమున్‌ - వివరించెదను స్తుతియించెదను
1)
నిన్ను నమ్మిన నీ భక్తునికి - ఎన్నో మేళ్ళను చేసితివయ్యా
నీవు చేసిన ఉపకారములకు - కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా
2)
నా చేతులకు యుద్ధమును - నా వ్రేళ్ళకు పోరాటమును
నా కృపానిధి నా కోట - నా ఆశ్రయ దుర్గమా నేర్పుము
3)
జ్ఞానులను వారి కుయుక్తిలో - పట్టుకొంటివి నా ప్రభువా
నీ జ్ఞానము నీ భక్తునికిచ్చి - శత్రుకు యుక్తిని అణచితివయ్యా
4)
పటగొట్టబడిన గుమ్మములన్‌ - కట్టుచుండగా నెహెమ్యా
అడ్డు తగిలిన శత్రువులన్‌ - ఓడించి జయమిచ్చితివయ్యా
5)
క్రీస్తు యేసుకులోబడునట్లు - ప్రతి ఆటంకము పడగొట్టి
దుర్గంబులను పడద్రోయగలిగే- యుద్ధోపకరణము లిమ్ము ప్రభువా
English   Mahatyamu Gala Devaa
Chorus
Mahaatmyamu Gala Devaa - Mahonnatudaa Yehovaa
Nee Bheekara Kaarya Vikramamun - Vivarinchedanu Sthuthiyinchedanu
1)
Ninnu Nammina Nee Bhaktuniki - Enno Mellanu Chesitivayyaa
Neevu Chesina Upakaaramulaku - Krutagnaataasthuthi Chellintunayyaa
2)
Naa Chetulaku Yudhamunu - Naa Vrellaku Poraatamunu
Naa Krupaanidhi Naa Kota - Naa Aasraya Durgamaa Nerpumu
3)
Gnaanulanu Vaari Kuyuktilo - Pattukontivi Naa Prabhuvaa
Nee Gnaanamu Nee Bhaktunikichchi - Satruku Yuktini Anachitivayyaa
4)
Patagottabadina Gummamulan - Kattuchundagaa Nehemyaa
Addu Tagilina Satruvulan - Odinchi Jayamichchitivayyaa
5)
Kreestu Yesukulobadunatlu - Prati Aatankamu Padagotti
Durganbulanu Padadroyagalige- Yuddhopakaranamu Limmu Prabhuvaa
Present