తెలుగు దేవునికే స్తోత్రములు
పల్లవిదేవునికే స్తోత్రములు - ప్రభువైన యేసుద్వారా నను రక్షించెన్
1)కన్య మరియ గర్భమునందుద్భవించెన్ - కల్వరి సిల్వలో
హీనమరణము నొందెను కలుషమెల్ల బాపెను క్రీస్తు ప్రభూ -
కనికరించి నాపై కృపజూపెను
|| దేవుని ||
2)పాపులను రక్షింప భువికి దిగివచ్చెన్ - కాపుదల యిచ్చెను
కరుణామయుడు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుండై పరలోక
పట్టణ ద్వారము నాకై తెరచెను
|| దేవుని ||
3)మొదటి ఆదాము అపరాధమును దెచ్చెను - కడపటి ఆదాము
పరిశుద్ధతను ఇచ్చెను సిలువ మరణము వరకు తగ్గించుకొనెను
నీతిమంతునిగ ననుజేసెన్
|| దేవుని ||
4)గొఱ్ఱెలకు ప్రాణంబునిచ్చుటకై వచ్చెన్ - నరుల పాపమెల్ల
మోయ గొఱ్ఱెపిల్ల యాయెన్ వధింపబడిన గొఱ్ఱెపిల్ల - మహిమ
ఘనత ప్రభావముల కర్హుండు
|| దేవుని ||
5)రాజులకు రాజు రక్షకుండు యేసు - ప్రాణమునుబెట్టి మరల
లేచెన్ స్థలమును సిద్ధపరచి త్వరగా - తిరిగి ధరకు వచ్చున్
హల్లెలూయ
|| దేవుని ||
English Devunike Stotramulu
ChorusDevunike Stotramulu - Prabhuvaina Yesudvaaraa Nanu Rakshinchen
1)Kanya Mariya Garbhamunandudbhavinchen - Kalvari Silvalo
Heenamaranamu Nondenu Kalushamella Baapenu Kreestu Prabhoo -
Kanikarinchi Naapai Krupajoopenu
|| Devuni ||
2)Paapulanu Rakshinpa Bhuviki Digivachchen - Kaapudala Yichchenu
Karunaamayudu Yesu Parisudhaatma Poornundai Paraloka
Pattana Dvaaramu Naakai Terachenu
|| Devuni ||
3)Modati Aadaamu Aparaadhamunu Dechchenu - Kadapati Aadaamu
Parisudhatanu Ichchenu Siluva Maranamu Varaku Tagginchukonenu
Neetimantuniga Nanujesen
|| Devuni ||
4)Gorrelaku Praananbunichchutakai Vachchen - Narula Paapamella
Moya Gorrepilla Yaayen Vadhinpabadina Gorrepilla - Mahima
Ghanata Prabhaavamula Karhundu
|| Devuni ||
5)Raajulaku Raaju Rakshakundu Yesu - Praanamunubetti Marala
Lechen Sthalamunu Sidhaparachi Tvaragaa - Tirigi Dharaku Vachchun
Hallelooya
|| Devuni ||