Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 257 Old No: 684

దేవుని కృపాతిశయము

Devuni Krupaatishayamu

Open in Word & Worship App
తెలుగు   దేవుని కృపాతిశయము
పల్లవి
దేవుని కృపాతిశయములను నిత్యము కీర్తింతును
ప్రభుని మహిమను ఎల్లరకు - నిత్యము ప్రకటింతును
ఆయనే నా దేవుడని ఆయనే నా సర్వమని
1)
పాపపు వల నుండి విడిపించెను - నాశనకరమగు ఉబినుండి
ననులేపెను కడిగెను - నా కలుషముల్‌ కల్వరిరక్తములో
నింపెను నా నోటిని క్రొత్త గీతముతో - నింపెను నా హృదిని
స్తోత్ర గీతముతో
2)
పరిశుద్ధునిగా నను జేసెను - రాజులైన యాజకులలో నను జేర్చెను
నింపెను నా హృదయమున్‌ - జీవవాక్యముతో - మార్చును ఈ
మంటిని మహిమరూపముకు
3)
నిత్యజీవము నా కిచ్చెను - నిత్యరాజ్యవారసునిగా ననుజేసెను
నిత్యము వసియింతునులే - ఆయన రాజ్యములో ఆనందింతును
అనవరతం ఆ ప్రభు సన్నిధిలో
English   Devuni Krupaatishayamu
Chorus
Devuni Krupaatisayamulanu Nityamu Keertintunu
Prabhuni Mahimanu Ellaraku - Nityamu Prakatintunu
Aayane Naa Devudani Aayane Naa Sarvamani
1)
Paapapu Vala Nundi Vidipinchenu - Naasanakaramagu Ubinundi
Nanulepenu Kadigenu - Naa Kalushamul Kalvariraktamulo
Ninpenu Naa Notini Krotta Geetamuto - Ninpenu Naa Hrudini
Stotra Geetamuto
2)
Parisuddhunigaa Nanu Jesenu - Raajulaina Yaajakulalo Nanu Jerchenu
Ninpenu Naa Hrudayamun - Jeevavaakyamuto - Maarchunu Ee
Mantini Mahimaroopamuku
3)
Nityajeevamu Naa Kichchenu - Nityaraajyavaarasunigaa Nanujesenu
Nityamu Vasiyintunule - Aayana Raajyamulo Aanandintunu
Anavaratan Aa Prabhu Sannidhilo
Present